twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ చిత్రం సేవ్ చేయటానికి శ్రీహరి...

    By Srikanya
    |

    హైదరాబాద్ : గతంలో శ్రీహరి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టైన చిత్రం మగధీర. ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో చిత్రం రాలేదు. ఆ మధ్య జంజీర్ తెలుగు వెర్షన్ కి శ్రీహరినే అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల సోనూ సూద్ సీన్ లోకి వచ్చారు. అయితే సోనూ సూద్ రీసెంట్ గా జరిగిన దుబాయి క్రికెట్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డారు.

    దాంతో సోనూ సూద్ డాక్టర్స్ ఎనిమిది వారాలు పాటు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో సోనూసూద్ ప్లేస్ లోకి శ్రీహరి వచ్చి చేరారు. ప్రస్తుతం శ్రీహరి పై ఆ సీన్స్ షూట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కు గానూ యోగి దర్శకత్వం చేస్తున్నారు. తెలుగు,హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం రూపొందుతోంది.

    రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' విడుదల తేదీ ఫిక్సైంది. ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రియల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు.

    గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

    జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ ..విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా,తేజ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సంజయ్ దత్, మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

    English summary
    Sonu Sood was injured recently in Dubai while playing cricket. He lost the coveted role in Telugu version of Zanjeer. Now, Srihari has replaced him. Indeed, Srihari was the original choice for this role but for some reasons the makers approached Sonu Sood and the Bollywood actor immediately agreed to do it. With Sonu Sood's injury, the makers had to approach Srihari again. Currently, the scenes are being canned on Srihari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X