శ్రీహరికి నివాళి...దాసరి, చిరు, ఎన్టీఆర్, చరణ్ కంటతడి(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు, రియల్ స్టార్ శ్రీహరి హఠాన్మరణం అందరినీ తెలుగు సినిమా పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ముంబై లీలావతి ఆసుపత్రి నుంచి శ్రీహరి మృతదేహం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకోగానే....చివరి చూపుకోసం సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఇంటి దారిపట్టారు.

ఆయన మృతదేహం నివాళులు అర్పిచేందుకు వచ్చిన దాసరి నారాయణరావు, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి తదితరులు కన్నీటి పర్యంతం అయ్యారు. చిరంజీవి, కృష్ణం రాజు, రామ్ చరణ్ తేజ్, దిల్ రాజు, కొరటాల శివ, వివి వినాయక్, శ్రీను వైట్ల, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, దర్శకుడు ఎన్ శంకర్, విష్ణు, మంచు లక్ష్మి, నల్లమలుపు బుజ్జి, సుమన్, పరుచూరి గోపాలకృష్ణ, తరుణ్, వందే మాతరం శ్రీనివాస్, జగపతి బాబు, ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి.హనుమంతరావు తదితరులు నివాళులు అర్పిచారు.

శ్రీహరి లేని లోటు పరిశ్రమలకు తీర్చలేనిదని, ఎంతో గొప్పనటుడిని పరిశ్రమ కోల్పోయిందని, తమ్ముడలాంటి వాడని చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు తదితరులు ఆయన మృతిపట్ల ఆవేదన వ్యక్తం చేసారు. శ్రీహరిని కడచూపు కోసం ఆయన ఇంటికి వచ్చిన సెలబ్రిటీలను స్లైడ్ సోలో చూడండి....

శ్రీహరి

శ్రీహరి


రాంబో రాజ్ కుమార్ షూటింగులో భాగంగా ముంబై వెళ్లిన శ్రీహరి...అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. గత కొంతకాలంగా శ్రీహరి కాలేయ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు.

చిరంజీవి, చరణ్

చిరంజీవి, చరణ్


కేంద్ర మంత్రి చిరంజీవి, నటుడు రామ్ చరణ్ శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం. వీరిద్దరితో శ్రీహరికి మంచి అనుబంధం ఉంది.

జూ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి

జూ ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి


నటుడు జూ ఎన్టీఆర్, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీహరికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం. శ్రీహరి వీరితో కలిసి బృందావనం చిత్రానికి పని చేసారు.

కృష్ణం రాజు

కృష్ణం రాజు


సీనియర్ నటుడు కృష్ణం రాజు శ్రీహరికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. కృష్ణం రాజు నటించిన బ్రహ్మనాయుడు చిత్రంతో తెలుగులో శ్రీహరి నటుడిగా కెరీర్ ప్రారంభించారు.

మంచు ఫ్యామిలీ

మంచు ఫ్యామిలీ


మంచు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, విష్ణు శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

దాసరి కంటతడి

దాసరి కంటతడి


స్టంట్ మాస్టర్ అయిన శ్రీహరిని నటుడిగా పరిశ్రమకు పరిచయం చేసిన దాసరి నారాయణరావు.....ఆయన మృతిని తట్టుకోలేక కంటతడి పెట్టారు.

సుమన్

సుమన్


శ్రీహరి మృతదేహానికి సీనియర్ నటుడు సుమన్ నివాళులు అర్పిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

తరుణ్

తరుణ్

యువ నటుడు తరుణ్ శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పించారు.

జయసుధ

జయసుధ

సీనియర్ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పించారు.

వివి వినాయక్

వివి వినాయక్

నటుడు వివి వినాయక్ శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఎన్.శంకర్

ఎన్.శంకర్

దర్శకుడు ఎన్.శంకర్ శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సురేస్ బాబు

సురేస్ బాబు

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు శ్రీహరి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం

శ్రీహరి వైప్, బ్రదర్

శ్రీహరి వైప్, బ్రదర్

శ్రీహరి హఠాన్మరణం అందరినీ షాక్ కు గురి చేసింది. శ్రీహరి మృతదేహం వద్ద కన్నీరు పెడుతున్న ఆయన భార్య శాంతి, సోదరుడు.

శ్రీహరి ఇద్దరు కుమారులు

శ్రీహరి ఇద్దరు కుమారులు

శ్రీహరికి ఇద్దరు కుమారులు. తండ్రి మరణంతో ఆ ఇద్దరు పిల్లలు పెద్ద దిక్కును కోల్పోయారు. తల్లి మృతదేహం వద్ద కన్నీరు పెడుతున్న తల్లిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

నటుడు బ్రహ్మాజీ శ్రీహరికి అంతిమ వీడ్కోలు పలికేందుకు వచ్చిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

రామానాయుడు

రామానాయుడు

ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు శ్రీహరి మృత దేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చని దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు శ్రీహరి మృతదేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబానకి సంతాపం తెలిపారు.

సాయిరాం శంకర్

సాయిరాం శంకర్

నటుడు సాయిరాం శంకర్ శ్రీహరి మృత దేహానికి నివాళులు అర్పించారు. సాయిరాం శంకర్, శ్రీహరి కలిసి పలు చిత్రాల్లో నటించారు.

అభిమానులు

అభిమానులు

శ్రీహరి మరణవార్త తెలియడంతో అభిమానులు కడచూపు కోసం ఆయన నివాసానికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X