శ్రీహరి ఇంట్లోనే మూడు నెలలు కూర్చుని...
శ్రీహరిగారి ఇంట్లోనే మూడు నెలలు కూర్చుని చిత్రకథ తయారు చేశాం. కథాచర్చల్లో ఆయన చెప్పిన కొన్ని సూచనలు కథకి బలాన్ని చేకూర్చాయి అంటున్నారు నూతన దర్శకుడు సహదేవ. శ్రీహరి హీరోగా దేవా ప్రొడక్షన్స్ సంస్థ సహదేవ దర్శకత్వంలో నిర్మించిన 'సర్కార్ గూండా' చిత్రం విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మీడియా సమావేసం ఏర్పాటు చేసారు. ఇక ఈ చిత్రం డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరుగుతోంది. పూర్తిగా డ్రగ్స్ చుట్టూ అల్లిన ఈ కథలో హీరో ఆ మాఫియాని ఎలా ఎదుర్కొని యువతని రక్షించాడన్నది చూపించనున్నారు.
అలాగే చిత్ర నిర్మాణ సమయంలో శ్రీహరిగారు అందించిన సహకారాన్ని మాటల్లో వర్ణించలేను. రాత్రి పగలు అనే తేడా లేకుండా తన సొంత సినిమాలా భావించి ఆయన వర్క్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. యూత్‌కి చిన్న సందేశం కూడా ఉంది అన్నారు. యువత మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అలాంటి యువత డ్రగ్స్ బారిన ఎందుకు పడుతున్నారు? అసలు మన దేశంలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? ఈ డ్రగ్స్ మాఫియాని సర్కార్ గూండా ఎలా ఎదుర్కొన్నాడు? అనే కథతో ఈ చిత్రం రూపొందించాం. శ్రీహరి నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది'' అని చెప్పారు.
నిర్మాత సుజాత దేవా మాట్లాడుతూ 'మా సినిమాలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా శ్రీహరిగారు నటించారు. తన అభినయంతో ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారు. ఎంతో రిస్క్ తీసుకుని ఛేజ్, ఫైట్ సీన్లలో నటించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మా దర్శకుడు సహదేవ సినిమాని బాగా తీశారు. యూనిట్ సభ్యులందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రంగనాథ్, జీవా, హబీబ్ భాయ్(ముంబాయి), సలీం జాబ్రి(ముంబాయి), నీను కార్తిక్ (ముంబాయి), అనన్య(ముంబాయి), గీతాంజలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: భాస్కర్ జాస్తి, సంగీతం: శ్రీలేఖ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్, సమర్పణ: దేవా విజిత, నిర్మాత: సుజాత దేవా, దర్శకత్వం: సహదేవ.


Click it and Unblock the Notifications











