సిల్క్ స్మిత సూసైడ్‌కు కారణం అదే..: భర్త చేసిన మోసంపై... డిస్కో శాంతి సంచలన కామెంట్స్!

Silk Smitha: సిల్క్ స్మిత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకులకు మైకం తెప్పిస్తూ తన అంచందాలతో కైపెక్కించిన ఐటెం బ్యూటీ సిల్క్ స్మిత. కానీ, ఈ అందాల భామ జీవితం అర్దాంతరంగా ముగిసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే తాజాగా సిల్క్ స్మిత సూసైడ్‌పై శ్రీ హరి సతీమణి డిస్కో శాంతి షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు చూద్దామా..

ఐటెం బ్యూటీ సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. అలనాటి ఐటెం బ్యూటీ సిల్క్ స్మిత గురించి శ్రీహరి సతీమణి డాన్సర్ డిస్కో శాంతి షాకింగ్ విషయాలను వెల్లడించింది. తను ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లలో ఆమెకు కలిసి పని చేశానని తెలిపారు. తాను స్మితను అక్కా అని పిలిచేదాన్నీ, తను చాలా మంచిదన్నారు. ఆమె అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుందన్నారు. ఆమె ఎంతో కష్టపడి పైకి వచ్చిందని, కానీ కొంతమంది ఆమెను మోసం చేశారంట షాకింగ్ కామెంట్స్ చేసింది డిస్కో శాంతి.

Srihari Satimani Dancer Disco Shanti Shocking comments About Item Beauty Silk Smitha Death

సిల్క్ స్మిత ఎలా చనిపోయిందని ప్రశ్నించగా.. తనకు తెలిసినంతవరకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోనే ఆత్మహత్య చేసుకుందని, ఆమె అలాంటి ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో.. తనకు అర్థం కాలేదన్నారు. ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు తాను ముంబైలో షూటింగ్ లో ఉన్నారంటూ.. ఆ విషయం తెలవడంతో ఒక్కసారిగా తాను షాక్ గురైననని ఎమోషనల్ అయింది డిస్కో శాంతి. స్మిత భర్త గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుందని, అతనికి అంతకంటే ముందే పెళ్లి పిల్లలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది. ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేదని, తాను కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేదాన్ని తెలిపారు.

అలాగే సిల్క్ స్మిత రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. ఆ రోజుల్లోనే ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకూ తీసుకునేదనీ, తాము ఆ రేంజ్ చేరుకోవడానికి పదేళ్లు పట్టిందనీ, స్మిత నెలకి ఐదు లక్షలు ఇంటి రెంట్ కట్టేదనీ, ఆమె చాలా విలాసవంతమైన జీవితం గడిపేదాని అన్నారు. స్మిత మంచం మీద డబ్బులు పరుచుకుని పడుకునేదాని, ఆ విషయాన్ని తానే చెప్పిందని షాకింగ్ వెల్లడించింది డిస్కో శాంతి.

Srihari Satimani Dancer Disco Shanti Shocking comments About Item Beauty Silk Smitha Death

ఇండస్ట్రీలో స్మితకు మంచి గౌరవం ఉండేదని, ఆమె ముందు ఎవరు మాట్లాడడానికి సాహసించే వారు కాదని కనీసం షార్ట్ రెడీ అయిందని చెప్పడానికి కూడా భయపడేవారు అంటూ డిస్కో శాంతి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. సిల్క్ స్మితకు సరిగా డాన్స్ చేయడం రాదని, కానీ.. తన బాడీలో మంచి గ్రేస్ ఉంటుందని, తన గ్లామర్ డ్రెస్సింగ్ తోనే ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X