టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన శ్రీహరి కుమారుడి లెటర్

తెలుగులో తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఆయన మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి ఓ హీరో పరిచయం అయ్యాడు. అతడే.. శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్. అతడు నటించిన చిత్రం "రాజ్ దూత్". అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది చిత్ర యూనిట్. ఒక బైక్‌ను మెయిన్ పాయింట్‌గా పెట్టి కథను డెవెలప్ చేశామని చిత్ర యూనిట్ ఇటీవల చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంతకంటే ముందు చిత్ర హీరో మేఘాంశ్ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశ్యించి ఓ లేఖ రాశాడు. ప్రస్తుతం ఈ లేఖ టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది.

Srihari Son Write A Letter To Telugu Audience

సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర హీరో ''హాయ్ నేను మేఘాంశ్.. శ్రీహరి గారి అబ్బాయిని అనే పేరు నాపై ఎంతో బాధ్యతను పెంచింది. ఆ బాధ్యతతోనే 'రాజ్ దూత్' అనే సినిమా చేశాను. ఇది కథను నమ్మి తీసిన సినిమా. తప్పకుండా మీకు అన్ని విధాలా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా నాన్న గారు 'ఢీ'లో శంకర్ పహిల్వాన్‌గా, కింగ్‌లో జ్ఞానేశ్వర్‌గా ఎంతగానో నవ్వించారు. ఆయనంతలా మిమ్మల్ని నవ్వించాలని నేను చేస్తున్న మొదటి ప్రయత్నం ఇది. మిమ్మల్ని అన్ని రకాలుగా అలరిస్తుందని నేను చేసిన ప్రయత్నం ఇది.

ఈ క్షణం మా నాన్న నాతో ఉంటే ఎంతో బాగుడేంది అనిపిస్తుంది. చిన్నప్పుడు 'బైరవ' సినిమా చేసినప్పుడు వేలు పట్టుకుని అన్నీ నేర్పించారు. అలాంటి తోడు ఇప్పుడు నాకు కావాలనిపిస్తోంది. కానీ, ఆయన నుంచి నేను నేర్చుకున్న హార్డ్ వర్క్‌ను పెట్టి ఈ సినిమా తీశాము. నాన్నగారు 'భద్రాచలం'లో చేసిన బరువైన పాత్రలు నేనిప్పుడే చేయలేకపోవచ్చు. కానీ, ఆ దిశగా అడుగులు వేస్తాను. శ్రీహరి అనే గొప్ప పేరు భుజాలపై పెట్టుకుని సినిమా తీయడం భయంగానే ఉంది. కానీ, మీరు నన్ను నన్నులా ఆదరిస్తారన్న నమ్మకమూ ఉంది.

శ్రీహరి గారి అబ్బాయి అని ఈ సినిమా చూడడానికి వచ్చిన వారందరినీ మేఘాంశ్ బాగా చేశాడని అనుకునేలా చేయాలని తీసిన ఈ 'రాజ్ దూత్' సినిమా ఇక మీ చేతుల్లో ఉంది. విజయాన్ని ఇస్తారని నమ్ముతూ.. మీ మేఘాంశ్ శ్రీహరి'' అంటూ లేఖ రాశాడు. ఇది చూసిన వారందరూ సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: srihari శ్రీహరి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X