కాపీ కొట్టడం కూడా రాదా?

ఇక ఈ విమర్శలు ప్రక్కన పెడితే నాగేశ్వరరావు ఒకే ఒక తెలివైన నిర్ణయం ఈ సినిమాకు తీసుకున్నాడని తెలుస్తోంది. అది మరేదో కాదు...మైహూనా మాదిరిగా శ్రీహరిని స్టూడెంట్ గా ప్రవేశపెట్టలేదని...అతను పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్తే చూడలేమని అంటున్నారు. అయితే కాలేజీలోకి శ్రీహరి ఎలా ప్రవేశిస్తాడూ అంటే బస్ డ్రైవర్ గా అని తెలుస్తోంది. ఇక విలన్ గా అందులో సునీల్ షెట్టి చేసిన పాత్రను యస్పాల్ శర్మ పోషించారు.రెబల్ స్టార్ కృష్ణం రాజు మరో పాత్రలో కనిపించి ఇలా నటించాడేంటి అనిపించాడని అంటున్నారు. గతంలో శ్రీహరి కి పోలీస్,దేవా,సాంబయ్య వంటి హిట్స్ ఇచ్చిన ఈ డైరక్టర్ ఇలాంటి సినిమాతో వస్తారని ఊహించలేమంటున్నారు. అయితే శ్రీహరి మాత్రం ఇది బి,సి సెంటర్లను టార్గెట్ చేసిన సినిమా ఇట్లానే ఉంటుందని అభయమిస్తున్నాడు.
movies telugu srihari srisailam main hoon na bollywood shahrukh suhasini బాలీవుడ్ శ్రీహరి శ్రీశైలం షారూఖ్


Click it and Unblock the Notifications