శ్రీహరి ప్రధాన పాత్రలో... తనీష్ సినిమా
హైదరాబాద్: ఈ మధ్య పలు చిన్న సినిమాలు శ్రీహరి స్టార్ ఇమేజ్‍ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అలాంటి తరహాలో మరో సినిమా రూపొందుతోంది. తనీష్ హీరోగా రియల్ స్టార్ శ్రీహరి ప్రధాన పాత్రలో నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.ఎస్. లక్ష్మణ్ దర్శకుడిగా పరిచయం చేస్తూ బండారు నారాయణరాజు ఓ సినిమా నిర్మించబోతున్నారు.
ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో తనీష్ లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో శ్రీహరి పోషిస్తున్న పాత్ర హైలెట్ గా నిలుస్తుందని, ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుందని, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.
మిర్రర్ మీడియా సమర్పిస్తున్న ఈచితానికి సి.హెచ్.కిరణ్, సి.హెచ్.విజయేంద్రరావులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హీరోగా శ్రీహరికి సినిమా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన 'బకరా' చిత్రం త్వరలో విడుదల కానుంది. అదే విధంగా ప్రియమణితో హీరోయిన్ గా రూపొందుతోన్న తిక్క చిత్రంలోనూ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











