నమిత ప్రధాన పాత్రలో చేస్తున్న దేశద్రోహి చిత్రంలో శ్రీహరి కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన శ్రీహరి పూర్తి స్ధాయి బిజీగా ఉంటున్నారు. రాజమౌళి మగధీర చిత్రలో కీ రోల్ చేసిన ఆయన తమిళ హీరో విజయ్ చిత్రంలోనూ చేయనున్నారు. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో రెడీ అవుతున్న దేశద్రోహి చిత్రంలో చేయటం ఆయన కెరీర్ కి మరో మలుపు అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రం తమిళంలో సైతం డబ్బింగ్ అవనుంది. ఈ చిత్రంలో నమిత ఓ పోలీస్ ఆఫీసర్ గా చేస్తోంది.
Story first published: Thursday, May 21, 2009, 18:28 [IST]