బ్యాట్స్ మ్యాన్ గా మారిన శ్రీహరి

హైదరాబాద్ : వెర్శటైల్ ఆర్టిస్టు శ్రీహరి త్వరలో బ్యాట్స్ మ్యాన్ గా కనిపించి అలరించనున్నారు. తన తాజా చిత్రం 'యమహో యమః'శ్రీహరి ఈ గెటప్ లో కనిపించి నవ్వించనున్నారు. ఈ సినిమాలో బ్యాట్స్ మ్యాన్ మాత్రమే కాక మరెన్నో గెటప్స్ శ్రీహరి వేస్తున్నాడని తెలుస్తోంది. శ్రీహరి ఈ చిత్రంలో యముడుగా కనిపిస్తారు. మనకు ఉన్నట్టుగానే అమెరికా వాళ్లక్కూడా యముడు ఉంటాడా? ఆ సంగతి తెలియదు కానీ, మన యముడు అమెరికాలో సందడి చేస్తే ఎలా ఉంటుంది? ఇంతకూ మన యముడికి అమెరికాలో ఏం పని? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే తమ 'యమహో యమః' చిత్రం.

పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ తాజా చిత్రం 'యమహో యమః'. శ్రీహరి యముడుగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఈ చిత్రం కథ ప్రకారం...పాపుల చిట్టా చూడాల్సిన యమధర్మరాజు అమెరికా వీధుల్లో ప్రత్యక్షమవుతాడు. అక్కడి వరకూ బాగానే ఉంది... ఎవరితో మాట్లాడదామన్నా భాషాపరమైన సమస్య. యముడికి ఆంగ్లంతో వచ్చిన చిక్కులు ఎలాంటివి? విషయం తెలుసుకున్న ఆయన భక్తుడు ఎలా స్పందించాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. వరాలిచ్చే దేవుళ్లను అందరూ పూజిస్తారు. ఆయువు తీరగానే తీసుకెళ్లిపోయే యముడి పేరు చెబితేనే కంగారుపడతారు. కానీ ఓ యువకుడు మాత్రం యమ నామ జపం చేశాడు. ఎందుకు? ఏం సాధించాడు? అన్నది తెర మీదే చూడమంటున్నారు.

యముణ్ని భక్తితో ఆరాధించే యువకుడిగా హీరో పాత్ర ఉంటుంది. ఆ చిత్రంలో సాయిరామ్ క్యారెక్టర్ గురించి దర్శకుడు జితేందర్‌.వై మాట్లాడుతూ... పొద్దున లేవగానే రామా.. కృష్ణా... అని తలచుకొనే భక్తుల్ని చూశాం. శివుడికీ, శ్రీ వెంకటేశ్వరస్వామికీ దండం పెట్టుకొనేవాళ్లనీ చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం నిత్యం యమనామ జపం చేస్తుంటాడు. యమధర్మరాజుకి అపరభక్తుడిగా మారిన ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. అలాగే... ఒక యమభక్తుడు సృష్టించే సందడితో ఆద్యంతం సరదాగా సాగే చిత్రమిది. యమధర్మరాజు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాన్ని తెరపైనే చూడాలి. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో కథ సాగుతుంది. యమధర్మరాజుగా శ్రీహరి నటన ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.

జితేందర్‌.వై. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'యమహో యమః'. సాయిరామ్‌ శంకర్‌, పార్వతి మెల్టన్‌ జంటగా నటించారు. సంజన మరో నాయిక. యముడి పాత్రలో శ్రీహరి కనిపిస్తారు.నిర్మాత విజయ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ ''చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తాం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందీ చిత్రం. ఈ సోషియో ఫాంటసీ కథతో యుముణ్ని అమెరికాకు తీసుకెళ్లాం. ఆ ఘట్టం తమాషాగా, వినోదాత్మకంగా ఉంటుంది''అన్నారు. రచన: వెలిగొండ శ్రీనివాస్‌, సంగీతం: మహతి, కళ: వి.ఎస్‌.మణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X