జంజీర్: శ్రీహరిని తీసుకోవడంపై సోనుసూద్ ఇలా...
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ జంజీర్ తెలుగువెర్షన్‌లో శ్రీహరిని తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ పాత్రకు సోను సూద్‌ను తీసుకున్నప్పటికీ... అనుకోకుండా అతని కాలుకు గాయం కావడంతో అతను సినిమా నుంచి తప్పకున్నాడు. దీంతో ఆ స్థానాన్ని శ్రీహరితో బర్తీ చేసారు. తన స్థానంలో శ్రీహరిని తీసుకోవడంపై సోను సూద్ క్రింది విధంగా స్పందించారు.
సోను సూద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ... 'శ్రీహరి వండర్ ఫుల్ యాక్టర్. జంజీర్ చిత్రంలో అతని లుక్ సూపర్‌గా ఉంది. ఆయన చేసే ప్రతి పాత్ర తనదైన శైలిలో చేస్తారు. వాస్తవానికి నేను షేర్ ఖాన్ పాత్రకు సరిపోనని ముందే అనుకున్నాను. కానీ మా బ్రదర్, దర్శకుడు అపూర్వ లఖియాతో కలిసి చేయాలనే ఈ పాత్రకు ఒప్పుకున్నాను' అని సోను సూద్ చెప్పుకొచ్చారు.
కాగా... శ్రీహరి జంజీర్ సెట్స్ లో ఎంటరై షూటింగులో పాల్గొంటున్నాడు. అందుకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్.
ఇందులో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అదే విధంగా టెలివిజన్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కవితా కౌసక్ జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన 'షకీలా బనో' అనే ఐటం సాంగు చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











