‘జంజీర్’లో శ్రీహరి గెటప్ ఇదే (చరణ్‌తో ఆన్ లొకేషన్ స్టిల్)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'జంజీర్'లో ఇటీవల శ్రీహరిని తీసుకున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. ఇప్పటికే శ్రీహరి జంజీర్ సెట్స్ లో ఎంటరై షూటింగులో పాల్గొంటున్నాడు. అందుకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. దాన్ని క్రింది ఫోటోలో చూడొచ్చు.
జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అదే విధంగా టెలివిజన్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కవితా కౌసక్ జంజీర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన 'షకీలా బనో' అనే ఐటం సాంగు చేయనుందని తెలుస్తోంది.
ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రిల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇటీవల విడుదలైన జంజీర్ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, టాలెంట్‌పై పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ....పలు బాలీవుడ్ సినిమాల అవకాశాలు వస్తున్నాయని, పలవురు దర్శక నిర్మాతలు తనకోసం తెచ్చిన స్క్రిప్టులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు కూడా. తాజాగా బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ రెండో బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











