»   »  శ్రీజ పేరిట రూ.37 కోట్లు!?!

శ్రీజ పేరిట రూ.37 కోట్లు!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu


శ్రీజ పేరిట చిరంజీవి పెద్దయెత్తుననే బ్యాంకు బ్యాలెన్స్ ను ఉంచినట్టు ఫిల్మ్ నగర్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ బ్యాలెన్స్ ఏకంకా రూ.37 కోట్ల మేరకు ఉన్నట్టు సమాచారం. మేజర్ కాగానే ఆ పెద్ద మొత్తం శ్రీజాకు చెందేలా చేసినట్టు భొగట్టా. శ్రీజ మేజర్ కావడం రహస్యంగా ప్రేమ వివాహం చేసుకోవడం వెంటవెంటనే జరిగాయి. శ్రీజ పెద్ద ఆస్తిపరురాలన్నమాట. ప్రేమ జంట ఇక అదురూ బెదురూ లేకుండా జీవనాన్ని కొనసాగించవచ్చని అనుకుంటున్నారు. డబ్బుకు గుర్తుతెలియని పెద్దల అండ ఉండడంతోనే శ్రీజ ధైర్యంగా అడుగులు వేసిందని భావిస్తున్నారు.

అందుకే పింకీ ఆనంద్ లాంటి ఖరీదు లాయరుతో వ్యవహారాన్ని నడుపుతున్నట్టు తెలుస్తోంది. శిరీష్ తండ్రి కూడా లాయర్ అయినప్పటికీ పింకీ ఆనంద్ ను ప్రభావితం చేసేంత సీన్ లేదని, ఈ వ్యవహారం వెనకాల కచ్చితంగా పెద్దల హస్తం ఉంటుందనే అనుకుంటున్నారు. కొంత సమయం గడిస్తే శ్రీజనే బయటపెడుతుంది. అందులో అనుమానం లేదు. అపుడే శ్రీజలో అసహనం పుట్టుకొచ్చింది. శిరీష్ కు బోరుకొడుతోందట కూడా. నిజాలు బయటకు రావడానికి సమయం మరెంతో దూరం లేదని చెప్పవచ్చు.

Read more about: srija assets chiru telugu cinema
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X