'ఆరెంజ్' ఫంక్షన్ కి చిరు కూతురు శ్రీజ రావటం వెనుక !?
చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ నిన్న(సోమవారం) శిల్ప కళా వేదికలో జరిగిన "ఆరెంజ్" ఆడియో పంక్షన్ కు హాజరవటం పరిశ్రమ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది. పబ్లిక్ ఫంక్షన్ గా జరిగిన ఈ ఆడియో విడుదల వేడుకలో శ్రీజ తన తల్లి తండ్రుల ప్రక్కన కూర్చుని కనపడింది. కొద్ది సంవత్సరాల క్రితం శిరీష భరధ్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కలిసినా పబ్లిక్ గా తన పేరెంట్స్ తో కలిసి కనపడటం ఇదే తొలిసారు. ఇలా కనపడటం ద్వారా తమ మధ్య పొరపొచ్చాలు సమిసి పోయాయని పరోక్షంగా చెప్పినట్లయిందని చూసిన వారు అంటున్నారు. ఇక పంక్షన్ లో అందరి దృష్టి ఆమె మీదే నిలవటం మరో విశేషం. ఇక చిరంజీవి..ఈ అమ్మాయిని తన అదష్ట లక్ష్మిలా భావిస్తారని, ఆమె పుట్టిన తర్వాతే బాగా కలిసివచ్చిందని సెంటిమెంట్ ఫీలవుతారని చెప్తారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత పెట్టిన పీఆర్పీ పార్టీ దెబ్బతినటం కూడా పరిగణలోకి తీసుకుని ఆ సెంటిమెంట్ ని బలపరుచుకుంటున్నారని తెలుస్తోంది. అయితే శ్రీజ కనపడినా ఆమె భర్త మాత్రం ఈ ఆడియో పంక్షన్ లో ఎక్కడా కనపడటం లేదు.


Click it and Unblock the Notifications











