శ్రీజ ఫేస్ లో కొట్టొచ్చిన మార్పు!?!
శ్రీజ-శిరీష్ భరద్వాజ్ ల జంట శుక్రవారం న్యూ ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్లో కనిపించింది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లు వాళ్ల వెంటపడ్డారు. ఇంతదాకా అడగకముందే మీడియాముందుకు వచ్చిన శ్రీజ శుక్రవారం మాత్రం మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. మీడియావారు రెండునిమిషాలు మాట్లాడితే చాలు అన్నా ఆమె తొందరగా రెస్పాండ్ కాలేదు. ఫోన్ మాట్లాడిన తరువాతగానీ మీడియాతో మాట్లాడలేదు. మీడియా ఇంతకుముందు మాట్లాడినంత ఉత్సాహంగా మాట్లాడలేదు. శ్రీజ మొహంలో నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనపడింది. తమవాళ్లెవరూ తనను సంప్రదించడంలేదని శ్రీజ ఫిర్యాదు చేసినట్టుగా చెప్పింది. రిసెప్షన్ ఏర్పాటు చేస్తే వస్తానన్నాను కానీ అటునుంచి ప్రోగ్రెస్ లేదని అంది. తను ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని మొహం చిట్లించుకొని చెప్పింది.


Click it and Unblock the Notifications











