శ్రీజ దంపతులకు పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రం
శ్రీజ-శిరీష్ దంపతులు తమపెళ్లి రిజిస్ట్రెషన్ పత్రాన్ని తీసుకున్నారు. మంగళవారం కవాడిగూడ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి వీరు తమ పత్రాన్ని తీసుకున్నారు. హిందూ వివాహచట్టం కింద వీరిద్దరూ తమ వివాహాన్ని సోమవారం అధికారికంగా నమోదు చేయించుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తిమ్మన వీరి పెళ్లిని ఆమోదించారు. పోయిన నెల 17న వీరిద్దరూ బోయిన్ పల్లి ఆర్యసమాజ్ మందిర్ లో వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన మరునాడే వీరు అధికారికంగా నమోదు చేయించుకున్నారు. వీరి వివాహానికి సాక్షులుగా శిరీష్ మామ మాధవరావు, మరో ఇద్దరు మిత్రులు సంతకాలు చేశారు.


Click it and Unblock the Notifications











