చిరంజీవిని కలుస్తారట!!
శ్రీజ దంపతులు చిరంజీవిని కలుస్తారట. బుధవారం సింహాచలం దర్శించిన ఈ దంపతులు చిరంజీవి ఇన్నాళ్లు నగరంలో లేకపోవడంతో కలిసే అవకాశం కలగలేదు. ఇపుడు చిరంజీవి నగరానికి రావడంతో చిరంజీవిని కలుసుకోవాలనుకుంటున్నట్టు శ్రీజ మీడియాకు చెప్పింది. ఢిల్లీలో ఉన్నప్పుడు తమ లాయర్ కు ఉత్తరం రాసిన చిరంజీవి ఆ ఉత్తరంలో తన ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పిన దాని ఆధారంగా తన తండ్రి ఆశిస్సుల కోసం ఇపుడు ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పింది. కాగాశిరీష్ స్నేహితుడు దాసరి సుమంత్ సహకారంతో విశాఖపట్టణంలోని సంహాచల అప్పన్న కొండను వీరు బుధవారం దర్శించారు. సుమంత్ ఇంటికి వెళ్లి భోజనం చేద్దామనుకున్నా మీడియాకు తెలియడం వలన శ్రీజ దంపతులు దానిని క్యాన్సిల్ చేసుకున్నారు. దర్శనానంతరం వారు విశాఖపట్టణం చేరుకున్నారు.


Click it and Unblock the Notifications











