శ్రీజ సినిమా చేస్తుందట!?!
మెగాస్టార్ ద్వితీయ కుమార్తె శ్రీజ,శిరీష్ భరద్వాజ్‌లు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో శ్రీజనే ఎక్కువగా మాట్లాడింది. విలేకరులడిగిన పలు ప్రశ్నలకు సునాయాసంగా సమాధానాలు చెప్పింది. ఆమె ఎలాంటి ప్రశ్న అడిగిన తగిన సమాధానం ఇచ్చింది. శ్రీజ ప్రేమ వివాహాన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు అంతే స్థాయిలో సమాధానమిచ్చి విలేకరులనే ఆశ్చర్యపడేలా చేసింది. తమ ప్రేమ కథ బాలీవుడ్ లేదా టాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించేందుకు సరిగ్గా సరిపోతుందని శ్రీజ అంది. అయితే తమ ప్రేమ కథ తెరకెక్కితే ఆ చిత్రానికి తన తన తండ్రే నిర్మాతగా ఉండాలని శ్రీజ జ్యోక్ పేల్చింది. అంతేకాకుండా ఈ చిత్రంలో తన భర్త శిరీష్ హీరోగా తాను హీరోయిన్ గా చేయడానికి సిద్ధంహా ఉన్నట్టు శ్రీజ మీడియాతో అంది.


Click it and Unblock the Notifications











