చిరు రాజకీయంపై శ్రీజ నో కామెంట్!
రాష్ట్రమంతా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై చర్చిస్తుంటే ఆయన కూతురు శ్రీజ మాత్రం గుళ్లు గోపురాలు తిరుగుతోంది. భర్త భరద్వాజ్, అత్తమామలతో కలిసి శ్రీజ శుక్రవారంనాడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె గుడికి వస్తున్న సమాచారం లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందిలేకుండా ఆమె తన కార్యక్రమాన్ని కొనసాగించింది. కొంతమంది విలేకరులు మాత్రం శ్రీజ రాకను గమనించి ఆమెతో మాట్లాడారు. వివాహం అయిన తరువాత అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నానని, ఇపుడు వీలు కుదరడంతో వచ్చానని చెప్పింది. చిరంజీవి రాజకీయాలలోకి వస్తారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రీజ నో కామెంట్ అంది. అదంతా నాకు తెలియదని అంది. తన భర్తతో తాను బాగానే ఉన్నానని అంది.


Click it and Unblock the Notifications











