శ్రీకాంత్, సదా, మీరా జాస్మిన్ 'అఆఇఈ' రిలీజ్
శ్రీకాంత్, సదా, మీరా జాస్మిన్..కాంబినేషన్ లో రూపొందిన అఆఇఈ చిత్రం ఈ రోజే రిలీజ్ అవుతోంది. హాస్య చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా మలిచిన ఈ చిత్రం చాలా కాలంగా అదిగో అప్పుడు ఇదిగో ఇప్పుడంటూ రిలీజ్ లు వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తాడు. అతని భార్య మీరా జాస్మిన్. చక్కగా సాగిపోతుందనుకున్న అతని సంసారంలోకి సునామీలా సదా ప్రవేశిస్తుంది. అక్కడ నుంచీ భార్యా భర్తల మధ్య ఏం పొరపొచ్చాలు వచ్చాయి. శ్రీకాంత్..భామలిద్దరి మధ్య ఎట్లా నలిగిపోయాడన్నది కధ. గతంలో అదిరిందయ్యా చంద్రం, కుబేరులు, యమగోల మళ్ళీ మొదలైంది,టాటా బిర్లా మధ్యలో మధ్యలో లైలా వంటి కామిడీలను రూపొందించిన దర్శకుడు శ్రీనివాస రెడ్డి రూపొందించిన చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉండే అవకాశం ఉంది.ఇక శ్రీకాంత్..వందవ చిత్రం మహాత్మ అనంతరం రిలీజ్ అవుతున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











