twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివి వినాయక్, అలీ, శ్రీకాంత్ జనసేనలోకి.. ఊహాగానాలపై క్లారిటీ, ఒకసారి దిగితే!

    |

    కుటుంబ కథ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ ఇప్పటి వరకు 125 చిత్రాల్లో నటించారు. శ్రీకాంత్ నటించిన 125 వ చిత్రం 'ఆపరేషన్ 2019'. 2007 లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓ ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

    జనసేనలోకి

    జనసేనలోకి

    ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, హాస్య నటుడు అలీతో కలసి శ్రీకాంత్ త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని శ్రీకాంత్ తెలిపారు. అవి క్రియేట్ చేసిన రూమర్స్ మాత్రమే. రాజకీయాల్లో నాకు తెలిసిన వారందరికీ శుభాకాంక్షలు చెబుతా. కానీ ఏ పార్టీలో చెరను అని శ్రీకాంత్ తేల్చేశారు.

    ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో

    ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో

    తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రమే ఎన్నికల ప్రచారానికి వెళ్లానని శ్రీకాంత్ తెలిపారు. అది కూడా రామానాయుడు గారి కోసమే. ఆ తరువాత ఎప్పుడూ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నా. అటు వైపు అడుగుపెట్టను అని శ్రీకాంత్ తెలిపారు. రాజకీయాల్లోకి ఒకసారి అడుగుపెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాల్సి పరిస్థితులు ఏర్పడతాయని శ్రీకాంత్ అన్నారు.

    'ఆపరేషన్ 2019'.. ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయలేదు.. హీరో శ్రీకాంత్!'ఆపరేషన్ 2019'.. ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయలేదు.. హీరో శ్రీకాంత్!

     అనవసరంగా చేసిన చిత్రాలు

    అనవసరంగా చేసిన చిత్రాలు

    తన కెరీర్ లో అనవసరంగా చేశాను అని అనిపించిన చిత్రాలు చాలా ఉన్నాయని శ్రీకాంత్ అన్నారు. ఒక చిత్రం విజయం సాధిస్తుందా లేదా అనే విషయం షూటింగ్ దశలోనే తెలిసిపోతుంది. కానీ కమిటయ్యాక బాధ్యతతో ఆ చిత్రాలని పూర్తి చేయాలి అని శ్రీకాంత్ అన్నారు. తాను రిజెక్ట్ చేసిన చాలా చిత్రాలు విజయం సాధించినవి కూడా ఉన్నాయి. డేట్స్ కుదరకపోవడం లాంటి సమస్యల వలన మంచి చిత్రాలని కూడా కొన్నిసార్లు వదులుకోవలసి వస్తుంది.

    రోషన్ తదుపరి చిత్రం

    రోషన్ తదుపరి చిత్రం

    శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మల కాన్వెంట్ చిత్రంలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం తరువాత రోషన్ మరో చిత్రంలో నటించలేదు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. రోషన్ తదుపరి చిత్రాన్ని వచ్చే ఏడాది ప్లాన్ చేస్తున్నాం అని శ్రీకాంత్ తెలిపాడు. పూరి జగన్నాథ్ దర్శత్వంలో అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం రోషన్ డాన్సులు, నటనపై దృష్టి పెట్టాడని అన్నారు.

    English summary
    Srikanth about his political entry. Operation 2019 will release tomorrow
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X