twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీతమ్మ వాకిట్లో ...’ టైటిల్ అలా పుట్టింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చెట్టు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై హిట్టైంది. ఈ చిత్రం విజయంలో టైటిల్ కు సైతం షేర్ ఉంది. ఈ టైటిల్ పెట్టాలన్న ఐడియా గురించి దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ... చిన్నప్పుడు మా ఊళ్లో రామాలయంలో భజన చేసే సందర్భంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...'అన్న వాక్యాల్ని విన్నాను. కథ అనుకున్నప్పుడే ఇదే టైటిల్ పెట్టాలని నిర్ణయించున్నాను. టైటిల్ విన్న నిర్మాత దిల్‌రాజుగారు 'టైటిల్ మరీ పొయొటిక్‌గా వుంది' అన్నారు. సినిమా విడుదలైన తర్వాత టైటిల్ విలువ తెలుస్తుందని దిల్‌రాజుగారికి చెప్పి ఒప్పించాను అన్నారు.

    కథ గురించి చెపుతూ....దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి రాసుకున్న కథ ఇది. సినిమాలో చూపించిన రేలంగి గ్రామం మా సొంతం ఉరే. అనుబంధాలు కలబోసిన కుటుంబం మాది. నైతిక విలువల్ని పాటిస్తూ నిరాడంబరంగా జీవితాన్ని సాగించాలని మా కుటుంబాన్ని చూసే నేర్చుకున్నా. నా స్వీయ అనుభవాలకు కొంత కల్పనను జోడించి ఈ కథను తయారుచేసుకున్నాను. కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుందనే సత్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాను అన్నారు.

    సినిమా హిట్ కు హీరోలిద్దరూ సహకరించారని చెపుతూ... ఈ కథలో వున్న భావోద్వేగాలు నటీనటులందరినీ ఒక్కతాటిపై నడిపించాయి. వెంక మహేష్‌బాబులు స్టార్ హీరోలమని కాకుండా కథలో పరకాయ ప్రవేశం చేసి సొంత అన్నదమ్ముల్లా భావించి నటించారు. నేను కూడా స్టార్స్‌తో సినిమా చేస్తున్నానని అనుకోలేదు. వాళ్లిద్దరు అన్నదమ్ముల్లని భావించి దర్శకత్వం చేశాను. వెంక మహేష్‌లిద్దరూ కథను ప్రేమించి సినిమా చేశారు. వారిద్దరి వల్లే సినిమాకు గొప్పదనం వచ్చింది. సీతారాముల అనుగ్రహం వల్ల సినిమాకు అన్ని చక్కగా సమకూరాయి అన్నారు.

    English summary
    
 Venkatesh and Mahesh Babu’s “Seethamma Vakitlo Sirimalle Chettu” is still going strong in all the areas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X