డిజాస్టర్ డైరెక్టర్ మళ్ళీ వస్తున్నాడు, శ్రీకాంత్ అడ్డాలకు బంపర్ ఆఫర్

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ను కలిసి.. స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్న శ్రీకాంత్ అడ్డాల.. అదే బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.

Recommended Video

మళ్ళీ వస్తున్న డిజాస్టర్ డైరెక్టర్

ఒక సినిమాకు నెగెటివ్ రిజల్ట్ వస్తే అది ఒక దర్శకుడి కెరీర్‌ను ఎలా మార్చేయగలదో గతంలో చాలా రుజువులే ఉన్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ టైటిల్ తోనే అటు ఇండస్ట్రీని.. ఇటు జనాల్లోను విపరీతమైన క్యూరియాసిటీ కలిగించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

మల్టీ స్టారర్ ట్రెండ్‌

మల్టీ స్టారర్ ట్రెండ్‌

ఒకే సినిమాలో వెంకటేష్ ను.. మహేష్ బాబును నటింపచేసి.. సక్సెస్ కొట్టి టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్‌కు ఆద్యం పలికాడు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం అంటూ మళ్లీ మహేష్ బాబుతోనే సినిమా చేసి.. భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు ఈ దర్శకుడు.

 శ్రీకాంత్ కెరీర్‌ను దెబ్బ కొట్టింది

శ్రీకాంత్ కెరీర్‌ను దెబ్బ కొట్టింది

‘బ్రహ్మోత్సవం' సినిమా ఫలితం శ్రీకాంత్ అడ్డాల కెరీర్‌ను కూడా అలాగే దెబ్బ కొట్టింది. ఈ సినిమా విడుదలై ఏడాదిన్నర అవుతున్నా అడ్డాలకు ఇంకో ఛాన్స్ రాలేదు. అతను ఇండస్ట్రీలో ఉున్న విషయమే తెలియట్లేదసలు. ఈ ఏడాదిన్నరలో అతను వార్తల్లోనే లేడు.

 అందరి దృష్టినీ ఆకర్షించాడు

అందరి దృష్టినీ ఆకర్షించాడు

ఇప్పుడు అందరూ మరిచిపోయిన సమయంలో శ్రీకాంత్.. నాగచైతన్య-సమంతల వెడ్డింగ్ రిసెప్షన్లో కనిపించి అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించాడు. శ్రీకాంత్ మామూలుగా ఇలాంటి వేడుకలకు హాజరు కాడు. ఐతే మళ్లీ ఓ సినిమాకు రెడీ అవుతున్న నేపథ్యంలోనే అతను ఈ వేడుకకు వచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

అతి పెద్ద ఫ్లాప్

అతి పెద్ద ఫ్లాప్

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ శ్రీకాంత్‌కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా హాట్ డిస్కషన్ నడుస్తోంది టాలీవుడ్లో. ఇదే వాస్తవమైతే ఆశ్చర్యపోవాల్సిందే.మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ ను జమ చేసి విమర్శల పాలైన శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు కొత్త సినిమా ప్రారంభించేందుకు సిద్ధమైపోతున్నాడు.

సుదీర్ఘకాలం పాటు గ్యాప్

సుదీర్ఘకాలం పాటు గ్యాప్

బ్రహ్మోత్సవం తర్వాత సుదీర్ఘకాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్.. గత ఆరు నెలలగా స్క్రిప్ట్ పై తెగ వర్క్ చేసేస్తున్నాడు. ఇప్పుడు స్టోరీ.. స్క్రిప్ట్.. ఓ కొలిక్కి రావడంతో.. మూవీ తీసేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని బడా బ్యానర్ పై నిర్మించనుండడమే విశేషం.

 గీతా ఆర్ట్స్ అధినేత

గీతా ఆర్ట్స్ అధినేత

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ను కలిసి.. స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్న శ్రీకాంత్ అడ్డాల.. అదే బ్యానర్ పై ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట. గత కొన్నేళ్లలో ‘బ్రహ్మోత్సవం' స్థాయిలో నెగెటివ్ టాక్ తెచ్చుకుని, అంత భారీ నష్టాలు తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు.

పెద్ద సినిమానే నిర్మిస్తాడా?

పెద్ద సినిమానే నిర్మిస్తాడా?

దీంతో ఇప్పుడిప్పుడే ఏ పెద్ద నిర్మాతా.. పెద్ద హీరో అడ్డాలకు ఛాన్సివ్వడనే అనుకున్నారంతా. కానీ ఆచితూచి సినిమాలు చేసే అల్లు అరవింద్ అతడికి ఛాన్సిస్తున్నాడంటే ఆశ్చర్యకరమైన విషయమే. మరి అడ్డాలతో అరవింద్ ఏదైనా చిన్న సినిమా తీస్తాడా లేక తన ఫ్యామిలీ స్టార్లను పెట్టి పెద్ద సినిమానే నిర్మిస్తాడా.. చూద్దాం మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X