శ్రీకాంత్ అడ్డాల నెక్స్ ప్లాన్స్ మామూలుగా లేవుగా.. కమల్ హాసన్-వెంకీతో!
కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో ఓ రేంజికి వెళ్లిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' లాంటి భారీ ప్లాపు తర్వాత చాలా వెనకపబడిపోయాడు. మూడేళ్లు గడిచినా ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.
అయితే త్వరలో గీతా ఆర్ట్స్ బేనర్లో ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సంక్రాంతికి తన సొంతూరైన రేలింగి వెళ్లిన ఈ దర్శకుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన తర్వాతి సినిమాల గురించి వెల్లడించారు.

కూచిపూడి వారి వీధి
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తాను చేయబోయే సినిమాకు ‘కూచిపూడి వారి వీధి' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో నటించేది ఎవరు? ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

కమల్ హాసన్-వెంకీ కాంబినేషన్లో మల్టీస్టారర్
అంతే కాదు... కమల్ హాసన్, వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి కథను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో శ్రీకాంత్ అడ్డాలతో ‘సీతమ్మ వారిట్లో సిరిమల్లె చెట్టు' చేసిన వెంకటేష్ ఈ మధ్య ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. శ్రీకాంత్ చెప్పిన స్టోరీతో వెంకీ ఇంప్రెస్ అయ్యాడని సమాచారం.

సినీ నిర్మాతగా కొత్త అవతారం
త్వరలో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనే యోచనలో ఉన్నట్లు కూడా శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

సినిమాలు..
శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి 10 ఏళ్ల దాటి పోయింది. 2008లో ఆయన మొదటి సినిమా ‘కొత్త బంగారులోకం' విడుదైలంది. ఆ తర్వాత 2013లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో బ్లాక్ బస్టర్ మూవీ తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత 2014లో వరుణ్ తేజ్‍ను పరిచయం చేస్తూ రూపొందించిన ‘ముకుంద' యావరేజ్‌గా నిలవగా... 2016లో వచ్చిన ‘బ్రహ్మోత్సవం' బిగ్గెస్ట్ ప్లాప్ అయింది.


Click it and Unblock the Notifications











