twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో శ్రీకాంత్ ఎవరికి శత్రువు?

    By Bojja Kumar
    |

    శ్రీకాంత్‌-అక్ష జంటగా వి.యస్‌.ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వంలో వి.యస్‌.రామిరెడ్డి నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రానికి 'శత్రువు' టైటిల్‌ ఖరారు చేసారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైద్రాబాద్‌, నానక్‌రామగూడలోని రామానాయుడు సినీ విలేజ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ అనంతరం బ్యాంకాక్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. బ్యాంకాక్‌లో రెండు పాటలతోపాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఆడియోను ఆగస్టు రెండోవారంలో విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    టైటిల్‌ ఖరారు చేసిన సందర్భంగా హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ... 'ఈ సినిమాకు 'శత్రువు' అనే టైటిల్‌ సరైనది. అయితే ఎవరికి ఎవరు శత్రువు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చాలా మంచి స్క్రిప్ట్‌తో రూపొందుతున్న సినిమా ఇది' అన్నారు.

    నిర్మాత వి.యస్‌.రామిరెడ్డి మాట్లాడుతూ.. 'మా హీరో శ్రీకాంత్‌గారి కోపరేషన్‌తో సినిమా షూటింగ్‌ సజావుగా, సాఫీగా సాగిపోతోంది. చాలా టైటిల్స్‌ పరిశీలించి.. చాలా రోజులు తర్జనభర్జన పడిన తర్వాత ఫైనల్‌గా 'శత్రువు' టైటిల్‌ ఖరారు చేసాం. బ్యాంకాక్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. ఆగస్టు రెండో వారంలో ఆడియోను విడుదల చేసి, సెప్టెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

    రెహమాన్‌, గిరిబాబు, బ్రహ్మ్రానందం, రఘుబాబు, చైతన్య మంత, వేణుమాధవ్‌, జాకీ, ప్రభాకర్‌, దువ్వాసి మోహన్‌ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి సినిమాటోగ్రఫి: రాహుల్‌, సంగీతం: గణ, ఎడిటర్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: వి.ఎన్‌.సాయిమణి, సాహిత్యం: చంద్రబోస్‌, సాహితి, కొరియోగ్రఫి: స్వర్ణ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వెంకట్‌ వుయ్యూరు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.వి.శాస్త్రి, నిర్మాణ నిర్వహణ: గుర్రం శ్రీనివాసరెడ్డి, నిర్మాత: వి.యస్‌.రామిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌

    English summary
    Srikanth and Aksha’s upcoming film has been titled as Shatruvu. NSR Prasad is directing the film and V S Ramireddy is producing the film on VSR Productions. The film’s shooting is almost complete and currently it’s being shot in Nanakramguda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X