twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘సంతోషం’మే కానీ శ్రీకాంత్ కి చావు దెబ్బ కొట్టింది

    By Srikanya
    |

    నాగార్జున హీరోగా అప్పట్లో వచ్చి హిట్టైన 'సంతోషం"చిత్రం కన్నడంలో రీమేక్ చేసారు.ఆ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి 'అమెరికా అల్లుడు"టైటిల్ తో తెలుగులో క్రితం వారం వదిలారు.ఆ చిత్రానికి మినిమం ఓపినింగ్స్ కూడా పోవటంతో శ్రీకాంత్ ఖాతాలో మరో ప్లాఫ్ చేరుకుంది.ఇంతకుముందు కూడా ఈ సంతోషం చిత్రాన్ని శ్రీకాంత్ తెలుగులో ఏవండోయ్ శ్రీవారు పేరుతో చిన్న చిన్న మార్పులతో ఫ్రీమేక్ చేసి వదిలాడు.అప్పుడూ వర్కవుట్ కాలేదు.అలాగ రెండు సార్లు ఈ సంతోషం చిత్రం శ్రీకాంత్ ని చావు దెబ్బ కొట్టింది.ఇక ఈ 'అమెరికా అల్లుడు"విషయానికి వస్తే కన్నడంలో వచ్చిన 'యుగాది" చిత్రానికి డబ్బింగ్ వెర్షన్.

    'యుగాది" చిత్రం తెలుగులో నాగార్జున, గ్రేసీసింగ్, శ్రీయ, ప్రభుదేవా ప్రధాన తారాగణంగా 2002లో వచ్చిన 'సంతోషం" చిత్రానికి రీమేక్.'యుగాది" చిత్రం కన్నడంలో 2007లో వచ్చింది.ఇక'యుగాది"సినిమాయే అందులోని రవిచంద్రన్ గతంలో నటించిన 'వొందు గుణబా" అన్న కన్నడ చిత్ర ఛాయల్లో ఉందనే విమర్శలు అప్పట్లో వినిపించాయి.అంటే అసలు ఎవరు ఎక్కడనుంచి ఏ సినిమా ఎత్తుతున్నారు..ఏ సినిమా ఎక్కడనుంచి రీమేక్ అవుతోంది అనే విషయం అర్దం కాని స్ధితిలో పడింది.ఇంతకీ శ్రీకాంత్ ఈ చిత్రంలో నాగార్జున వేసిన పాత్ర చేయలేదు.ప్రభుదేవా చేసిన పాత్రను చేసాడు.అదీ విషయం.

    English summary
    Ugadi was a remake of Telugu hit Santhosham. Srikanth played the role of Prabhudeva in Kannada version as per the request of his friend Ravichandran, who played Nagarjuna’s role in it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X