Kotabommali P.S Twitter Review: కోటబొమ్మాళికి క్రేజీ టాక్.. అతడి రోల్ హైలైట్.. బోల్డు సీన్స్ మాత్రం!

మిగిలిన జోనర్ల కంటే క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో వచ్చే చిత్రాలకు మంచి స్పందన వస్తుంటుంది అని చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా ఇలాంటి చిత్రాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. అందుకే వేరే భాషల్లో హిట్టైన థ్రిల్లర్ మూవీలను తెలుగులోకి తీసుకు వస్తున్నారు. ఇప్పుడు అలా రీమేక్ అయిన మూవీనే 'కోటబొమ్మాళి పీఎస్'. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరే చూసేయండి మరి!

కోటబొమ్మాళి పీఎస్ అంటూ:శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'కోటబొమ్మాళి పీఎస్'. తేజ మర్ని తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు, కొప్పినీడి విద్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళి శర్మ, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Srikanth and Varalaxmi Sarathkumar Starrer Kotabommali P.S Movie Twitter Review

అలాంటి స్టోరీ.. అవి కూడా:మలయాళ సినిమా 'నాయట్టు'లోని కథాంశాన్ని తీసుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కించిన సినిమానే 'కోట బొమ్మాళి పీఎస్'. ఓ ఊరిలోని పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన కథతో ఇది రూపొందింది. ఇందులో పొలిటికల్ పంచ్‌లు, బోల్డు డైలాగులు వంటివి యాడ్ చేసి కమర్షియల్‌గా తీశారు. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఆయన నటన అద్భుతం:క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన 'కోట బొమ్మాళి పీఎస్' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ 'కోట బొమ్మాళి పీఎస్ మూవీని మా ముందుకు తీసుకు వచ్చినందుకు నిర్మాతలను మెచ్చుకోవాలి. వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కలిసి శ్రీకాంత్ తన కెరీర్‌లోనే అద్భుతమైన ప్రదర్శన చేశారు. మురళి శర్మ యాక్టింగ్ బాగుంది. తేజ డైరెక్షన్, నాగేంద్ర డైలాగ్స్ బాగున్నాయి' అని చెప్పుకొచ్చారు.

హీరో శ్రీవిష్ణు రివ్యూ ఇలా:'కోట బొమ్మాళి పీఎస్' సినిమా చూసిన హీరో శ్రీవిష్ణు ట్విట్టర్‌లో 'వెండితెరపైనే చూడదగిన కోటబొమ్మాళి సినిమాను చూశాను. పోలీసులు చేంజింగ్ చేసే సన్నివేశాల్లో శ్రీకాంత్, వరలక్ష్మి అద్భుతంగా నటించారు. శివాని, రాహుల్ నటన కూడా బాగుంది. ఇంత మంచి కంటెంట్‌ను అందించిన గీతా ఆర్ట్స్ వాళ్లకు ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చాడు.

హీరో నిఖిల్ సిద్దార్థ్ అలా:'కోట బొమ్మాళి పీఎస్' చిత్రాన్ని చూసిన హీరో నిఖిల్ ట్విట్టర్‌లో 'ఇప్పుడే కోటబొమ్మాళి సినిమా చూశాను. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో అందరికీ కనెక్ట్ అయ్యే పార్ట్ ఉంది. ఇంత ప్రభావవంతమైన సినిమాను తీసినందుకు నిర్మాతలకు, దర్శకుడికి అభినందనలు. శ్రీకాంత్ అన్న, రాహుల్, శివాని రాజశేఖర్ సహా అందరు నటులకూ బెస్ట్ విషెస్' అంటూ రాసుకొచ్చాడు.

హరీశ్ శంకర్ ట్వీట్ చేసి:'కోట బొమ్మాళి పీఎస్' చూసిన తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్ 'కోటబొమ్మాళి సినిమాను ఇప్పుడే చూశాను. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య స్క్రీన్ ప్లే, చేజింగ్ సీన్స్, థియేటర్‌లలో ప్రతి ఒక్కరినీ వారి వారి సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ గారికి ఒక అద్భుతమైన పాత్ర వచ్చింది. ఆయన నటన ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తుంది' అన్నారు.

బోల్డుగా, పవర్‌ఫుల్‌గానూ:ఇదే ట్వీట్‌లో హరీశ్ శంకర్ 'ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పార్ట్ ఉంది. ఇప్పటికే ఉన్న సిస్టమ్ గురించి కొన్ని బోల్డ్, పవర్ ఫుల్ డైలాగ్‌లు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి. నిర్మాతల ధైర్యాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. ప్రస్తుత సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి నేను కొన్ని డైలాగ్‌లను కనెక్ట్ అయ్యాను' అని చెప్పుకొచ్చారు.

ఓవరాల్‌గా అలాంటి టాక్:'కోట బొమ్మాళి పీఎస్' సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లు అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో బోర్ కొట్టే సీన్స్ కాకుండా మంచి సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయని వీక్షకులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా ఈ చిత్రం అందరూ చూడొచ్చని అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X