పోసాని కృష్ణ మురళిని బహిష్కరించాలంటూ దర్నా
నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తాజా చిత్రం దుశ్సాసన ప్రారంభం కాకముందే వార్తల్లో నిలిచింది. పోసాని తాజాగా తీస్తున్న దుశ్శాసన చిత్రంలో శ్రీకాంత్ మేకప్ విప్లవనాయకుడు చెగువేరాను పోలి ఉండటంపై సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్ కార్యాలయంలో వారు ధర్నా నిర్వహించారు. ఈ చిత్ర షూటింగ్ నిలిపివేసి పోసానిని పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ చాంబర్ కార్యదర్శి కె.సి.శేఖర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ విప్లవ యోధుడిగా కీర్తింపబడుతున్న చెగువేరాను ఇష్టంవచ్చినట్లు చిత్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలభారత విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు కె. సృజన్‌కుమార్, ఉమామహేష్, స్టాలిన్, వేణు అఖిలభారత యువజన సమాఖ్య కార్యకర్తలు మనోహర్‌నాయుడు, మల్లేష్, లింగస్వామి పాల్గొన్నారు. పోసాని దర్శకత్వంలో శ్రీకాంత్ 'ఆపరేషన్ దుర్యోధన" చిత్రం తర్వాత చేయబోతున్న చిత్రం ఇదే. ప్రస్తుతం శ్రీకాంత్ 'రంగ దీ దొంగ" చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా వున్నారు.ఇక పోసాని ఆశించింది ఈ మాదిరి పబ్లిసిటీనే అని అది నెరవేరుతున్నందుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











