శ్రీకాంత్ త్వరలో మహాత్మడుగా అవవాతం ఎత్తబోతున్నాడు. కృష్ణవంశి డైరక్షన్ లో రూపొందనున్న వందో చిత్రానికి ఆ టైటిల్ అనుకంటున్నారు. పిబ్రవరి పదిహేనవ తేదీన ప్రారంభం కానున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మళయాళ బ్యూటీ భావనని అనుకుంటున్నారు. భావన ఇంతకు ముందు గోపీచంద్ సరసన ఒంటరి చిత్రంలోనూ, నితిన్ సరసన హీరో చిత్రంలోనూ కనువిందు చేసింది. ఇక బెంగుళూరు కి సంభంధించన నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.దాదాపు పన్నెండు కోట్ల వరకూ ఈ చిత్రంపై పెట్టటానికి వారు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక గతంలో కృష్ణవంశి కాంబినేషన్ లో వచ్చిన ఖడ్గం చిత్రం కన్నా ఈ చిత్రం ఫవర్ ఫుల్ గా ఉండాలని యోచిస్తున్నారు. ఇక స్క్రిప్టు వర్క్ ని ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ దాదాపు పూర్తి చేసారని తెలుస్తోంది. వరంగల్ యాసిడ్ దాడి నేపధ్యంలో ఈ కథ,కథనాలు ఉంటాయని సమాచారం.