నాగార్జునతో పాటు శ్రీకాంత్ కూడా ఫుల్ లెన్త్!
నాగార్జున షిరిడి సాయిబాబా పాత్రలో 'షిడిరి సాయి' చిత్రం రూపొందులోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ష్టిల్స్‌ను బట్టి శ్రీకాంత్ ఈ చిత్రంలో సాయి ముఖ్య సహాయకుల్లో ఒకరిగా నటిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. నాగార్జునతో పాటు శ్రీకాంత్ కూడా ఫుల్ లెన్త్ సినిమా మొత్తం కనిపిస్తాడని యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.
ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తుండగా...శ్రీ సాయి కృప ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎ. మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున 'సాయి బాబా' గెటప్‌లో పర్ ఫెక్టుగా కనిపించేందుకు ప్రత్యేకమైన డైట్ తీసుకోవడంతో పాటు ఎన్నడూ లేని విధంగా, బాగా గడ్డం పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రైవేట్ ఫంక్షన్లు, పబ్లిక్ ప్లేసుల్లో ఆయన్ను తెల్లగడ్డంతో చూసిన వారంతా ఆశ్చర్య పోతున్నారు.
ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలు ఆడియో పరంగానే కాక అన్ని విధాలుగా మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 'షిరిడి సాయి' చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కులుమానాలిలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











