twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర తెలియక మాట్లాడుతున్నారు: 'దేవరాయ' దర్శకుడు

    By Srikanya
    |

    హైదరాబాద్: ''నేను చరిత్రను వక్రీకరించాననేది చరిత్ర తెలియని వాళ్లు చెప్పే మాట. ఎవరికీ పూర్తి చరిత్ర తెలియదు. శ్రీకృష్ణదేవరాయుల చరిత్రకు సంబంధించి భిన్న వాదలున్నాయి. కొన్ని శాసనాలు మినహా ఆధారాలేమీ లేవు. ఆయనకు సంబంధించిన శాసనాల్లోని ఓ చిన్న ఘట్టాన్ని మాత్రమే తీసుకుని సినిమాని రూపొందించాను. ''అన్నారు దర్శకుడు నానికృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'దేవరాయ'. ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. రిలీజ్ రోజు డివైడ్ టాక్ తెచ్చుకుంది..అంతేగాక చరిత్రను వక్రీకరించారంటూ పలు విమర్శులను సైతం ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో చిత్రం యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

    హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ '''మహాత్మ' తర్వాత నాకు ఊపిరినిచ్చిన చిత్రం 'దేవరాయ'. నా పాత్ర పోషణకు, సంభాషణలకు థియేటర్లలో ప్రేక్షకులు చాలా సందడి చేస్తున్నారు. దర్శకుడు నానికృష్ణపై నేను పెట్టుకున్న నమ్మకం నిజమైంది. సినిమా విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూశాను. దేవరాయలుగా నేను సంభాషణలు పలుకుతున్నప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి మాటల్లో చెప్పలేని సంతోషం కలిగింది.''అన్నారు.

    అలాగే... ''కొత్తదనం ఉన్న కథ తీసుకురా.. చేద్దాం అని నానికృష్ణకు చెప్పాను. అప్పుడు తను ఈ 'దేవరాయ' కథ చెప్పాడు. కాస్త ధైర్యం తెచ్చుకొని 'ఓకే' అనేశాను. ఎందుకంటే... కృష్ణదేవరాయలు పాత్ర ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి మహా ఉద్దండులు చేశారు. అలాంటి పాత్రను నేను చేయడం నిజంగా సాహసమే. అందుకే ముందుగా ఓ ఫొటో షూట్ కూడా చేయించుకుని, ఆ గెటప్‌లో నన్ను నేను చూసుకుని, తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. ఇందులో నాది 'ద్విపాత్రాభినయం'. పల్లెటూరిలో అల్లరి చిల్లరిగా తిరిగే దొరబాబు పాత్ర ఒకటైతే, ద్వితీయార్ధంలో వచ్చే కృష్ణదేవరాయలు పాత్ర మరొకటి. అసలు ఈ తరం దొరబాబుకీ ఆ తరం దేవరాయలుకీ సంబంధం ఏంటి అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు శ్రీకాంత్.

    15వ శతాబ్ధానికి సంబంధం ఉన్న సోషియో ఫాంటసీ కథాంశమిది. చక్కని చందమామ కథలా ఉంటుంది. వినోదం, ఉద్వేగం, ఉత్కంఠ ఉన్న చిత్రమిది. రాయలవారి పాత్ర, దొరబాబు అల్లరి, తెలుగుదనంపెై వచ్చే ఎపిసోడ్‌, అమ్మవారి రూపాన్ని ఆవిష్కరించే గ్రాఫిక్‌ వర్క్‌ సినిమాలో హైలెట్స్‌.''ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది''అన్నారు హీరోయిన్స్ మీనాక్షి దీక్షిత్‌, విదిశ. సమష్టి కృషికి ఈ సినిమా విజయమే నిదర్శనమని కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ రాజా, కొండవలస, సమ్మెట గాంధీ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Devaraya Movie Success Meet Function held at Hyderabad. Actor Srikanth, Actress Meenakshi Dixit and Vidisha graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X