జస్ట్ మిస్...లేకుంటే నేను ఔటే : శ్రీకాంత్
హైదరాబాద్ : హీరో శ్రీకాంత్ పెద్ద యాక్సిడెంట్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. నెల రోజుల క్రితం మలేషియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తను నటిస్తున్న షాడో చిత్రంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంత కాలం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన శ్రీకాంత్ తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'మళ్లీ పుట్టాను...షాడో షూటింగులో పెద్ద యాక్సిడెంట్ నుంచి బయట పడ్డాను. జస్ట్ లో మిస్సయింది. లేకుంటే నేను ఈ లోకంలో ఉండే వాడిని కాదేమో. ఆ దేవుడి దయవల్లే బ్రతికాను' అంటూ శ్రీకాంత్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రధారులుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి 'షాడో' చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈచిత్రంలో మరో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకంత్ సరసన మధురిమ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
సంక్రాంతికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్. సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ. శ్రీకాంత్ ప్రస్తుతం దేవరాయ అనే మరో చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











