మంచి రేటింగ్ ఇచ్చారంటూ తెలుగు హీరో ఆనందం
'సినిమాకు అందరూ మంచిరేటింగ్ ఇచ్చారు. దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం. వారం రోజులు గడిచిన తర్వాత కూడా కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి' అని శ్రీకాంత్ తన తాజా చిత్రం విరోధి గురించి అన్నారు. ఆయన హీరోగా రూపొందిన ఈ చిత్రం క్రితం వారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసి శ్రీకాంత్ ఇలా అన్నారు. అలాగే...తొలిసారిగా మా సంస్థలో నిర్మించిన చిత్రం 'విరోధి'. సాధారణంగా సొంత సంస్థలో సినిమాను తీస్తే వ్యాపారాత్మకంగా ఆలోచిస్తారు. కానీ మేము అలా ఆలోచించకుండా అందరూ మెచ్చేవిధంగా దీనిని నిర్మించాం. ఈ చిత్రంలో పవర్‌పుల్ జర్నలిస్టు పాత్రను పోషించాను. ఒక సున్నితమైన అంశాన్నిఇందులో ఆవిష్కరించాం. హీరోయిజం కోసం ఈ సినిమాను చేయలేదు. ఓ మంచి పాత్ర చేయాలన్న ఉద్దేశంతో ఇందులో నటించాను అని చెప్పుకొచ్చారు. డబ్బులు రావటం లేదనే శ్రీకాంత్ ఈ తరహాలో మాట్లాడుతున్నాడని ఇది విన్నవారు అంటున్నారు.


Click it and Unblock the Notifications











