twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేబులు కొట్టేయడం వెన్నతో పెట్టిన విద్య కాదు కత్తెరతో పెట్టిన విద్య

    By Sindhu
    |

    జేబు కొట్టేయడం అతనికి కత్తెరతో పెట్టిన విద్య. రెప్పపాటులో ఉన్నదంతా వూడ్చేయడం మనోడి అలవాటు. అయితే అందరి జేబులు కోసేయడు. కేవలం పోలీసుల్ని దోచుకొంటాడు. ఇదే పనిలో నిమగ్నమైన ఆ దొంగ ఆడ పోలీసు మంగమ్మకి దొరికిపోయాడు. అక్కడ కూడా తన చోర కళకు పని చెప్పాడు. ఏకంగా మంగమ్మ మనసునే కాజేశాడు. ఇంతకీ ఎవరా దొంగ? ఆ ప్రేమాయనం ఎక్కడిదాకా చేరింది? తెలియాలంటే శ్రీకాంత్ హీరోగా నటించింన రంగది దొంగా చూడాల్సిందే‌. ఈ చిత్రంలో విమలారామన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఫైట్ మాస్టర్ సుధాకర్‌ నాయుడు (జీవీ) దర్శకుడు. సి.ఆర్‌.మనోహర్‌, జీవీ నిర్మాతలు. డిసెంబర్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల రానుంది. దర్శకుడు మాట్లాడుతూ 'ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. శ్రీకాంత్‌ పాత్ర రెండు కోణాల్లో ఆవిష్కృతమవుతుంది. దొంగగా ఎంత వినోదాన్ని పంచారో...ఫ్యాక్షనిస్టుగా అంత రౌద్రాన్ని చూపించారు. రమ్యకృష్ణ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని చక్రి స్వరపరచారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X