నాగ్ ‘మన్మధుడు’ తరహాలో శ్రీకాంత్ ‘లక్కీ’ !
హైదరాబాద్: శ్రీకాంత్, మేఘనారాజ్ జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'లక్కీ'. రాజరాజేశ్వరి హరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రాన్ని నవంబర్ 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య సరైన హిట్ లేని శ్రీకాంత్ లక్కీ చిత్రం మళ్లీ తనకు లక్కు తెచ్చి పెడుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.
ఈ చిత్రం గురించి హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్‌తో సినిమాను క్లారిటీగా రూపొందించాడని, ఆడవాళ్ళ మనసుల్లో మాటలన్నీ తెలిస్తే ఆ మనిషి ఎలాంటి సంఘర్షణకు లోనవుతారన్న కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ మధ్య కాలంలో అన్నీ మాస్ సినిమాలే చేసారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథల్లో కనిపించ లేదు. ఆ లోటు 'లక్కీ' చిత్రం తీరుస్తుందన్నారు.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి వివరిస్తూ.... ఈ చిత్రంలో నా పేరు లక్ష్మీ నారాయణ. అందరూ లక్కీ అని పిలుస్తుంటారు. అమ్మాయిలంటే నాకు బొత్తిగా నచ్చదు. సృష్టిలో అనర్థాలకు అమ్మాయిలే కారణం అనుకుంటాను. అలాంటి అబ్బాయిని ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది లక్కీ కథ అని చెప్పుకొచ్చారు.
శ్రీకాంత్ చెప్పే స్టోరీ పరిశీలిస్తే....నాగార్జున హీరోగా వచ్చిన నమ్మథుడు తరహాలో ఉంది కదూ..! మరి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఏవీఎస్, గీత, సన, తాగుబోతు రమేష్, నల్లవేణు, సుమన్ శెట్టి, చిత్రం శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: పడాల శివసుబ్రహ్మణ్యం, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, నిర్మాత: రాజరాజేశ్వరి, రచన, దర్శకత్వం: హరి.


Click it and Unblock the Notifications











