శ్రీకాంత్, మీరా చిత్రం ప్రోగ్రెస్

By Staff

Srikanth
శ్రీకాంత్‌, మీరాజాస్మిన్ జంటగా నటిస్తున్న చిత్రం 'అ.ఆ.ఇ.ఈ'. సదా మరో కథా నాయిక. శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడు. బి.అశోక్‌యాదవ్‌ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల అరకులో జరిగింది. ఆ విశేషాలను దర్శకుడు చెబుతూ మరో నాలుగు పాటలు, రెండు ఫైట్లు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయిందని చెప్పారు. మరికాస్త ప్యాచ్‌ వర్క్‌ మిగిలుంటుందని, నవంబరు 3 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్‌ చేస్తామని వివరించారు.

ఇటీవల అరకులో రైల్వే పట్టాల మీద రామ్‌-లక్ష్మణ్‌ల నేతృత్వంలో పతాక సన్నివేశాలను తెరకెక్కించాం. ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే అంతర్లీనంగా సెంటిమెంట్‌తో సాగుతుంద''ని పేర్కొన్నారు. కృష్ణభగవాన్‌, సునీల్‌, అలీ, రఘుబాబు, తనికెళ్ల భరణి, కవిత, తెలంగాణ శకుంతల, ఏవీయస్‌, ఉత్తేజ్‌, వేణుమాధవ్‌, జయప్రకాష్‌రెడ్డి, చంద్రమోహన్‌, చలపతిరావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: శ్రీలేఖ, సాహిత్యం: భాస్కరభట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X