శ్రీకాంత్-అక్ష జంటగా విఎస్ఆర్ ప్రొడక్షన్స్ చిత్రం
శ్రీకాంత్-అక్ష జంటగా విఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వి.ఎస్.రామిరెడ్డి నిర్మాత. ప్రముఖ పారిశ్రామిక వేత్త బాల్లా బ్రహ్మనాయుడు సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్ 6న, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం 9.30 గంటలకు ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, మాజీ కేంద్రమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, నటి రోజా, నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ లతో పాటు రాజకీయ, సినీ మరియు వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
రఘు, గిరిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, జాకీ, ప్రభాకర్, దువ్వాసి మోహన్ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాహుల్, సంగీతం: గణ, ఎడిటర్: వి. నాగిరెడ్డి, ఆర్ట్: వి.ఎన్. సాయిమణి, సాహిత్యం: చంద్రబోస్, కాస్ట్యూమ్స్ డిజైనర్: శ్రీ, మేకప్: ఎ.శేఖర్, కొరియెగ్రఫీ: స్వర్ణ, ప్రెస్ రిలేషన్స్: ధీరజ అప్పాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రంగ, ప్రొడక్షన్ కంట్రోలర్: వెంకట్ వుయ్యూరు, నిర్మాణ నిర్వాహణ: గుర్రం శ్రీనివాసరెడ్డి, సమర్పణ: బొల్లా బ్రహ్మనాయుడు, నిర్మాత: వి.ఎస్.రామిరెడ్డి, దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్.


Click it and Unblock the Notifications











