శ్రీకాంత్ కొత్త టైటిల్ 'రంగా-ది దొంగ' !?
నితిన్ తో గతంలో 'హీరో' అనే చిత్రం డైరక్ట్ చేసిన జీవి తాజాగా శ్రీకాంత్ తో ఓ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ చిత్రానికి టైటిల్ గా 'రంగా-ది దొంగ' అనే వెరైటీ టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా చార్మిని బుక్ చేసారు. ఇంతకుముందు 'కౌసల్యా సుప్రజా రామా' లో చేసిన ఈ జంట ఈ రంగాలో రిపీట్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్ తో వందవ చిత్రం 'మహాత్మ' ను నిర్మించిన మనోహర్ ప్రొడ్యూస్ చేయనున్నారు. 'మహాత్మా' చిత్రం భాక్సా ఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అలాగే మహాత్మ లో చార్మి ఓ ఐటం సాంగ్ కూడా చేసింది. అప్పుడే నిర్మాత ఆమెతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక మహాత్మ చిత్రం తర్వాత రిలీజైన శ్రీకాంత్ 'అఆఇఈ' చిత్రం కూడా మొదటి రోజుకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇక చార్మి లేటెస్ట్ గా 'మంత్ర' చిత్రం దర్శకుడు తులసీరామ్ దర్శకత్వంలో 'మంగళ' అనే చిత్రంకి కమిటయ్యింది.


Click it and Unblock the Notifications











