twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ కు అనుకున్నది శ్రీకాంత్ కి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆ మధ్యన మహేష్,సుకుమార్ కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతున్న చిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ లోగా అలాంటిదేమీ లేదని దర్శకనిర్మాతలు ఖండించారు. ఇప్పుడా టైటిల్ తో శ్రీకాంత్ చిత్రం చేస్తున్నాడు.

    శ్రీకాంత్‌ హీరోగా నటించే ఓ చిత్రానికి 'ఆచార్య' అనే పేరుని నిర్ణయించారు. శ్రీకాంత్‌ 'ఆచార్య'కి ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకుడు. ఈయన గతంలో 'రక్ష' చిత్రం తీశారు.

    శ్రీకాంత్ మాట్లాడుతూ "వంశీకృష్ణ చెప్పిన కథ వినగానే నా కెరీర్‌లో 'ఖడ్గం', 'ఆపరేషన్ దుర్యోధన' ఎలా ప్రత్యేకమైన చిత్రాలో అలాగే ఈ సినిమా కూడా ఓ ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అభిప్రాయం కలిగింది'' అని చెప్పారు.

    దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ "శ్రీకాంత్ కేరక్టర్ శక్తిమంతంగా, భావోద్వేగభరితంగా, సామాజిక బాధ్యతతో నడుస్తుంది'' అని తెలిపారు. క్రియేటివ్ హెడ్‌గా శ్రీనివాసరాజు పనిచేస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని కూడా వంశీకృష్ణ సమకూరుస్తున్నారు.

    అలాగే చిత్రం ప్రేరణ కు చెందిన విషయం చెప్తూ... ''నా కూతురు స్వేచ్ఛగా, క్షేమంగా పెరిగి పెద్దదికావడానికి అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కనిపించడం లేదు.. అని అభిషేక్‌ బచ్చన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వ్యాఖ్యల స్ఫూర్తితో తయారుచేసుకున్న కథ ఇది. వచ్చే నెల్లో చిత్రీకరణ మొదలుపెడతాము''అన్నారు.

    English summary
    Srikanth is going to act in a movie directed by 'Raksha' fame Vamsi Krishna Aakella. 'Lepakshi Vaari', a new banner, will produce this movie. This film is titled as Aacharya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X