నాని దసరా సినిమా ఆగిందన్న నెటిజన్ ట్వీట్ కు డైరెక్టర్ షాకింగ్ ఆన్సర్
నేచురల్ స్టార్ నాని ఇటీవలే "శ్యామ్ సింగరాయ్" మంచి హిట్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా "అంటే సుందరానికి" అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. నాని హీరోగా ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో "దసరా" అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటూ జరుగుతున్న ప్రచారం మీద ఈ సినిమా దర్శకుడు స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

షూటింగ్ ఆగిపోయిందని
సింగరేణి నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రీషూట్ జరుగుతోందని
అదే విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #దసరా #నాని సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ సదరు నెటిజన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్క్రిప్ట్, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి రీషూట్ జరుగుతోందని సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు.

రూమర్లకు చెక్
ఈ ట్వీట్ ను చూసిన 'దసరా' టీం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంతేకాదు 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ నెటిజన్ కి ఘాటుగా సమాధానం ఇచ్చాడు. బ్రహ్మానందం జిఫ్ ఫైల్ ను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చాడు. ఒకేఒక్క జిఫ్ ఫైల్ తో 'దసరా' సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు. ఈ సినిమా ఇప్పటికే 30% షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అన్ని పుకార్లను కొట్టివేస్తూ, బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా ఆగిపోయిందని ట్వీట్ చేసిన వ్యక్తికి దర్శకుడు షాకిచ్చే రిప్లైతో నోరు మూయించాడు.

పదెకరాల్లో
ఈ సినిమాలో నాని తన కెరీర్లో తొలిసారిగా తెలంగాణ ఆధారిత లోకల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇక నాని తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే కాగా... 'దసరా' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని సెట్లు వేశారు. పదెకరాల్లో భారీ విలేజ్ సెట్ ను నిర్మించినట్టు సమాచారం. ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు పన్నెండు కోట్లు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.

డార్క్ థీమ్ తో
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకోనున్నాడు. సింగరేణి నేపథ్యంలో డార్క్ థీమ్ తో తెరకెక్కుతున్న 'దసరా' మూవీ విడుదల గురించి నాని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











