చిరంజీవికి 'ఖైదీ' చిత్రంలా శ్రీకాంత్ కి ఈ సినిమా
మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే కోరిక శ్రీకాంత్‌కి అప్పటినుంచో ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుంది. చిరంజీవికి 'ఖైదీ' చిత్రంలా శ్రీకాంత్‌కి ఈ చిత్రం అంత గుర్తింపు తెస్తుంది' అంటున్నారు నిర్మాత సి.కళ్యాణ్. శ్రీకాంత్ హీరోగా నటుడు జి.వి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రంగ ది దొంగ' చిత్రం ఆడియోను రవిప్రకాష్ ఆవిష్కరించి తొలి సిడిని సి.కళ్యాణ్‌కు అందచేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ పై విధంగా స్పందించారు. ఇక హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ' ఈ సినిమాలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాను. జివి ఈ సినిమాని ఎలా తీస్తాడనే భయం నాకు మొదట్లో ఉండేది. కొన్ని రోజులు వర్క్ చేశాక ఆ భయం పోయింది. ఈ సినిమా కోసం అతను హోంవర్క్ బాగా చేశాడు. నాతో రెండో సినిమా తీసిన మనోహర్‌గారికి కృతజ్ఞతలు' అన్నారు. దర్శకుడు జి.వి.మాట్లాడుతూ '80 రోజుల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. అందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది. ఫ్యాక్షన్ వల్ల జీవితాలు పాడు చేసుకుంటున్న బడుగు, బలహీన వర్గాలవారి వెతలను ఈ సినిమాలో చూపించామని చెప్పుకొచ్చారు.ఇక ఆదిత్య ఆడియో సంస్థ ద్వారా ఈ సిడిలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











