శ్రీకాంత్ ‘రంగ ది దొంగ’ విడుదల ఎప్పుడంటే...
దొంగగా, ఫ్యాక్షనిస్టుగా రెండు భిన్నమైన పాత్రలు చేస్తూ రెడీ అయిన శ్రీకాంత్ తాజా చిత్రం 'రంగ ది దొంగ" డెసెంబర్ 31వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. శ్రీకాంత్, విమలా రామన్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రాన్ని సుధాకర్ నాయుడు (జీవీ) దర్శకత్వంలో సి.ఆర్.మనోహర్, జీవీ నిర్మించారు. రీసెంట్ గా 'రంగ ది దొంగ" చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బరంగా నిర్మాత మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఆయన మాటల్లో...శ్రీకాంత్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. దొంగగా, ఫ్యాక్షనిస్టుగా రెండు భిన్నమైన పాత్రలలో ఆయన కనిపిస్తారు. దొంగ పాత్ర విషయానికి వస్తే కేవలం పోలీసు అధికారుల ఇళ్లల్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. అతని పాత్రలో మంచి వినోదం ఉంటుంది. అలాగే సినిమాకు అవసరమైనంత యాక్షన్, ఎమోషన్ ఉంది. శ్రీకాంత్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రంచూసి అభినందనలు తెలిపారని అన్నారు.
భవిష్యత్తులో రాబోయే దొంగ సినిమాలకు రంగ పాత్ర ఓ నమూనాలా మారుతుందనే నమ్మకం ఉంది అంటున్నారు దర్శకుడు సుధాకర్ నాయుడు(జీవి) అన్నారు. శ్రీకాంత్ తో మహాత్మా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఈ చిత్రాన్ని నిర్మించటం విశేషం. అలాగే జీవీ ఇంతకు ముందు నితిన్ హీరోగా హీరో అనే చిత్రం రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చక్రి కూడా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా ఓ గమ్మత్తైన పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











