దైవసన్నిధిలో నేను వారి గురించి మాట్లాడను..!?
రంగ ది దొంగతో సహా పలు చిత్రాల్లో నటిస్తున్న హీరో శ్రీకాంత్ ఇక తన తదుపరి చిత్రాలవైపు దష్టి సారిస్తున్నట్టు చెప్పారు. వెంకటేశ్వర స్వామిని దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన కాసేపు మీడియాలో ముచ్చటిస్తు ఒడిదుడుకులెన్ని ఎదురైనా 100చిత్రాల్లో నటించింది నేనేనా? అన్న ఆశ్చర్యం తనకిప్పటికీ ఉందని అయితే ప్రేక్షకుల దీవెనలు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనని వెన్నంటి నడిపిస్తున్నాయని..మరిన్ని విభిన్న కథాంశాలతో చిత్రాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.
తమ భూములని కాంగ్రెస్ ఎంపి వెంకటస్వామి ఆక్రమించుకోవటం పై స్పందించేందుకు నిరాకరిస్తూ దైవసన్నిధిలో రాజకీయనాయకుల గూర్చి మాట్లాడటం కూడా సమంజసం కాదని..తాను కేవలం శ్రీవారిని దర్శనం కోసం మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు. అంతకు ముందు తితిదే అధికారులు శ్రీకాంత్ ని ప్రత్యేక దర్శనానికి తీసుకు వెళ్ళి నాయక మండపంలో ప్రసాదాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











