twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెప్పుతో ముఖ్యమంత్రిని కొట్టే దృశ్యాలు కట్

    By Srikanya
    |

    శ్రీకాంత్‌, తషుకౌశిక్‌, సంజన, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి ముఖ్యపాత్రలు పోషించిన 'దుశ్శాసన' చిత్రం లాఫింగ్‌ ఆర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాన నిర్మితమయింది. ఈ చిత్రానికి నిర్మాత పోసాని కృష్ణమురళి. దర్శకుడు మురళీకృష్ణ.

    అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'దుశ్శాసన' చిత్రం చూసి 25.5.2011న 'ఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.

    మొదటి రెండు రీళ్లలో :

    1. ఎ) ''ఆ రెండు వున్నాయని చెప్పి, ఒకటి దానం చేసి''

    బి) ''ఎవడికో పెళ్ళాం లేదని నాకు ఇద్దరు పెళ్ళాలు వుంటే ఒక పెళ్ళాన్ని ఇచ్చేస్తానా''

    సి) ''పెళ్ళాల బ్యాంకు ఉండదురా ఇడియెట్‌'' డైలాగ్స్‌ కత్తెర పాలయ్యాయి.

    2. స్విమ్మింగ్‌ సూట్‌తో స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఇద్దరు అమ్మాయిలు తొడలను ఎక్స్‌పోజ్‌ చేసే

    దృశ్యాలను కత్తిరించారు.

    మూడు నాలుగు రీళ్ళలో :

    3. పిచ్చాసుపత్రిలోని సిబ్బందిని హీరో కొట్టే దృశ్యాల నిడివి తగ్గించి ప్లాష్‌లా చూపమన్నారు.

    4. ''కళ్ల ముందు పెళ్లాం వుందని ఇరవై నాలుగ్గంటలూ కాపురం చేస్తామా'' అనే డైలాగ్‌ కత్తిరింపుకు

    గురైంది.

    5. ఐటమ్‌సాంగ్‌లో క్లీవేజ్‌ ఎక్స్‌పోజర్‌కి సంబంధించి అన్ని దృశ్యాలను తొలగించారు.

    అయిదు, ఆరు రీళ్ళలో :

    6. ముఖ్యమంత్రి కూతురుని దుశ్శాసన రేప్‌చేసే దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమన్నారు.

    7. చెప్పుతో ముఖ్యమంత్రిని కొట్టే దృశ్యాలను తగ్గించి ఫ్లాష్‌లా చూపమన్నారు.

    8. ఎ) వాటర్‌ బోర్డ్‌ ఉద్యోగులను కొట్టే దృశ్యాల నిడివి తగ్గించి ఫ్లాష్‌లా చూపమన్నారు.

    బి) టాయిలెట్‌ ఔట్‌లెట్‌ని మంచినీళ్ల పైపుతో హీరో కలిసే దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమన్నారు.

    సి) వాటర్‌బోర్డ్‌ లోని మహిళా ఉద్యోగుల ముఖం మీద మంత్రి కొడుకు కొట్టే దృశ్యాల నిడివి

    తగ్గించి ఫ్లాష్‌లా చూపమన్నారు.

    9. తొమ్మిది పదిరీళ్ళలో మంత్రికొడుకుని, హీరో భార్యని ఒకే సమయంలో పోలీస్‌స్టేషన్లో

    ముఖంమీద కొట్టే దృశ్యాల నిడివి తగ్గించి ఫ్లాష్‌లా చూపమన్నారు.

    10. ఎ) పదకొండు పన్నెండు రీళ్లలో పోలీస్‌ ఆఫీసర్‌ని హీరో కాల్చే దృశ్యాలను నిడివి తగ్గించి

    ఫ్లాష్‌లా చూపమన్నారు.

    బి) ఎన్‌.డి.టి.వి నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలని లేదంటే 'ఎన్‌.డి.టి.విని బ్లర్‌చేసి

    సినిమాలో చూపాలని సూచించారు.

    12891.2 మీటర్ల నిడివిగల 'దుశ్శాసన' చిత్రం 27-5-11న విడుదల అయింది.

    English summary
    Hero Srikanth, Sanjana and Tashu starrer film “Dussasana” relesed and flop. This film with “A” certificate few cuts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X