ఆ తెలుగు సినిమా 'టేకిన్' కాపీ?
హైదరాబాద్ : 2008 లో వచ్చి విజయవంతమైన హాలీవుడ్ చిత్రం టేకిన్ చాలా మంది సినిమా ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడా సినిమా ప్రేరణతో తెలుగులో ఓ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. శ్రీకాంత్ హీరో రూపొందుతోన్న 'హంటర్' చిత్రం అదే అని చెప్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తన చెల్లికోసం వెతకే ప్రయత్నాలతో సాగే కథ అంటున్నారు. ఒరిజనల్ లో కూతురుని ఇక్కడ చెల్లిగా మార్చారని తెలుస్తోంది. శ్రీకాంత్ కి జోడిగా కామ్నా జెఠ్మలాని జంటగా నటిస్తోంది.
'హంటర్' చిత్రాన్ని సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు మాట్లాడుతూ ''మా వేటగాడు దేనికి గురి పెట్టాడు? ఈ వేటలో అనుకున్నది సాధించాడా లేదా అన్నదే సినిమా. శ్రీకాంత్ చిత్రాల తరహాలోనే సాగుతూ చక్కటి వినోదాన్ని అందిస్తుంది''అన్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రానికి చంద్రమోహన్, అజయ్, ఎం. ఎస్.నారాయణ, కృష్ణభగవాన్, సూర్య, బెనర్జీ, సమీర్ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కొరయోగ్రఫీ: ప్రదీప్-కళాధర్, ఫైట్స్: రవివర్మ - డ్రాగన్ ప్రకాష్, నందు, ఎడిటర్: శంకర్, కెమెరా: సురేంద్రరెడ్డి, పాటలు: భాస్కరభట్ల, కందికొండ, చిర్రావూరి విజయ్‌కుమార్, సంగీతం: చక్రి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సత్యనారాయణ ద్వారపూడి.


Click it and Unblock the Notifications











