నవ్వించే... ('మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో' ప్రివ్యూ)
హైదరాబాద్: ప్రస్తుతం కామెడీ సినిమాలకు ఆదరణ బాగుంది. అందులోనూ బ్రహ్మానందం హవా నడుస్తున్న ఈ టైమ్ లో ఆయన్నికీలక పాత్రలో చేసుకుని నవ్వించటానికి సిద్దమవటం సేఫ్ గేమే. వరస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీకాంత్ తన పంధామార్చుకుని నవ్వించటానికి సిద్దమయ్యి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. 'ఒట్టేసి చెబుతున్నా', 'ఏవండోయ్ శ్రీవారు'లాంటి చిత్రాలకు కథలు అందించిన ఉదయ్ రాజ్ ఈ చిత్రంతో దర్శకుడు గా మారుతున్నారు.
'వన్ ఇయర్ మాత్రమే గ్యారెంటీ' అనేది ఉపశీర్షిక తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ మ్యారేజ్ బ్యూరో నడుపుతూంటాడు. తన పెళ్లి చేయమని అతని దగ్గరకు బ్రహ్మానందం వస్తాడు. అలాగే మరోప్రక్క తెలంగాణ శకుంతల సైతం పెళ్లి కోసం అతని చుట్టూ తిరుగుతుంది. అన్నాళ్లూ బ్రహ్మచారిగా ఉన్న బ్రహ్మానదం హఠాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ పెళ్లి చేసే ప్రాసెస్ లో శ్రీకాంత్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది కామెడీతో నడిచే కథ.
దర్శకుడు మాట్లాడుతూ... కథా రచయితగా శ్రీకాంత్ సినిమాతోనే సినీ కెరీర్ మొదలుపెట్టిన నేను ఇప్పుడు ఆయన చిత్రంతోటే దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. హీరో మ్యారేజ్ బ్యూరో ఎందుకు పెట్టారనేది ఆసక్తికరంగా ఉంటుంది. పెళ్ళిళ్లు స్వర్గంలోనే నిర్ణయమవుతాయని అంటారు పెద్దలు. ఆ మాటనే మల్లిగాడితో అంటే అస్సలు ఒప్పుకోడు. స్వర్గందాకా ఎందుకు? కాస్త డబ్బిస్తే మీకు ఇష్టమైన అమ్మాయితో నేను పెళ్లి చేస్తా అని సెలవిస్తాడు. అందుకే అతగాడి మ్యారేజ్ బ్యూరోకి చాలా డిమాండ్. ఇంతకీ మల్లిగాడు ఎవరెవరి పెళ్ళిళ్లు ఎలా చేశాడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు ఉదయ్‌రాజ్.ఎ.
శ్రీకాంత్ మాట్లాడుతూ ''ఇటీవల వినోదానికి దూరమయ్యా. ఇదివరకు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసేవాడిని. కానీ కొన్ని కారణాలవల్ల రూటు మార్చాల్సి వచ్చింది. అందుకే నా ప్రయాణంలో తేడా వచ్చింది. ఇది మాత్రం 'వినోదం', 'మా నాన్నకు పెళ్లి' చిత్రాల్లా అందరికీ నచ్చుతుంది. బ్రహ్మానందం, నేను కలిసి తెరపై చేసిన సందడి ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఉదయ్‌రాజ్ ఇదివరకు 'ఒట్టేసి చెబుతున్నా', 'ఏవండోయ్ శ్రీవారు'లాంటి సినిమాలకి కథని అందించాడు. ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు''అన్నారు.
బ్యానర్ :హరిత ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: శ్రీకాంత్, మనోచిత్ర, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, తెలంగాణ శకుంతల, సాయి, కల్కి రాజా, శిరీష, ఫిష్ వెంకట్, మధుమణి, రాఘవ, నండూరి రాము తదితరులు
మాటలు: దాసరి బ్రహ్మానందం, ఎం. అశ్విన్‌కుమార్,
సంగీతం: రఘు రాం,
ఛాయాగ్రహణం: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను.
నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి
కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం : ఉదయ్‌రాజ్
విడుదల తేదీ: 07,పిభ్రవరి 2014.


Click it and Unblock the Notifications












