బ్రహ్మానందంకు పెళ్లి చేయటానికి పడే తిప్పలే కథ
హైదరాబాద్: శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నటిస్తున్న చిత్రం 'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో'. 'వన్ ఇయర్ మాత్రమే గ్యారెంటీ' అనేది ఉపశీర్షిక. హరిత ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదివరకు పలు చిత్రాలకు కథలను అందించిన ఉదయ్‌రాజ్ ఎ. దర్శకునిగా పరిచయమవుతున్నారు. రఘురామ్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సినిమాపై శ్రీకాంత్ మంచి నమ్మకం పెట్టుకున్నాడు.
ఈ చిత్రంలో శ్రీకాంత్ మ్యారేజ్ బ్యూరో నడుపుతూంటాడు. అతని దగ్గరకు బ్రహ్మానందం వస్తాడు. అతనో ఖాన్ దాదా. అతనికి ఓ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ వల్ల భయం ఉంటుంది. ఎప్పుడు వచ్చి వేసేస్తాడో అని వణికిపోతూంటాడు. ఈ లోగా ఆ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ కు ఉన్న వీక్ పాయింట్ తెలుస్తుంది. అతను పెళ్ళియిన వాళ్లని వదిలేస్తాడనేదే ఆ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ బలహీనత. దాంతో బ్రహ్మానందం వెంటనే పెళ్లి కావాలనుకుంటాడు. అయితే ఏజ్ బారైన దాదాకు,క్రిమినల్ కి ఎవరు పిల్లనిస్తాడు. అప్పుడు మల్లిగాడు దగ్గరకు వస్తాడు. అతను ఆ సమస్యను ఎలా పరిష్కరించి..బ్రహ్మానందంను కాపాడాడు అన్నదే ఈ చిత్రం కథ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అది కరెక్టా కాదా అన్నది తెలియాలంటే మూడు రోజులు ఆగాల్సిందే.

దర్శకుడు మాట్లాడుతూ... కథా రచయితగా శ్రీకాంత్ సినిమాతోనే సినీ కెరీర్ మొదలుపెట్టిన నేను ఇప్పుడు ఆయన చిత్రంతోటే దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. హీరో మ్యారేజ్ బ్యూరో ఎందుకు పెట్టారనేది ఆసక్తికరంగా ఉంటుంది. పెళ్ళిళ్లు స్వర్గంలోనే నిర్ణయమవుతాయని అంటారు పెద్దలు. ఆ మాటనే మల్లిగాడితో అంటే అస్సలు ఒప్పుకోడు. స్వర్గందాకా ఎందుకు? కాస్త డబ్బిస్తే మీకు ఇష్టమైన అమ్మాయితో నేను పెళ్లి చేస్తా అని సెలవిస్తాడు. అందుకే అతగాడి మ్యారేజ్ బ్యూరోకి చాలా డిమాండ్. ఇంతకీ మల్లిగాడు ఎవరెవరి పెళ్ళిళ్లు ఎలా చేశాడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు ఉదయ్‌రాజ్.ఎ.
శ్రీకాంత్ మాట్లాడుతూ ''ఇటీవల వినోదానికి దూరమయ్యా. ఇదివరకు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసేవాడిని. కానీ కొన్ని కారణాలవల్ల రూటు మార్చాల్సి వచ్చింది. అందుకే నా ప్రయాణంలో తేడా వచ్చింది. ఇది మాత్రం 'వినోదం', 'మా నాన్నకు పెళ్లి' చిత్రాల్లా అందరికీ నచ్చుతుంది. బ్రహ్మానందం, నేను కలిసి తెరపై చేసిన సందడి ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఉదయ్‌రాజ్ ఇదివరకు 'ఒట్టేసి చెబుతున్నా', 'ఏవండోయ్ శ్రీవారు'లాంటి సినిమాలకి కథని అందించాడు. ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు''అన్నారు.
బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, తెలంగాణ శకుంతల, సాయి, కల్కి రాజా, శిరీష, ఫిష్ వెంక ట్, మధుమణి, రాఘవ, నండూరి రాము తారాగణమైన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: ఉదయ్‌రాజ్, మాటలు: దాసరి బ్రహ్మానందం, ఎం. అశ్విన్‌కుమార్, సంగీతం: రఘు రాం, ఛాయాగ్రహణం: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలాజీ శ్రీను.


Click it and Unblock the Notifications











