16న హీరో శ్రీకాంత్ 'మొండోడు' ఆడియో
ఆయన మాట్లాడుతూ 'ఈ నెల 16న చిత్రం ఆడియో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. మధుర ఆడియో కంపనీ ద్వారా విడుదల అవుతోంది ఈ చిత్ర సంగీతం. ఆగస్టు నెలలోనే చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆయన అన్నారు.
కథానాయకుడు శ్రీకాంత్ 'దొంగ'గా కనిపిస్తారని, పాత్ర తీరు తెన్నులు వైవిధ్యంగా ఉంటాయని, తన బిడ్డ కాదు అసలు తానెవరో కూడా తెలియని ఓ చిన్న పాపకోసం ప్రాణాలు ఇవ్వటానికైనా, ప్రాణాలు తీయటానికి అయినా సిద్ధపడే ఓ దొంగ కధే ఈ 'మొండోడు' అని దర్శకుడు జర్నలిస్ట్ 'ప్రభు' తెలిపారు
పూర్తి వినోదంతో పాటు అంతర్లీనంగా ఓ మంచి సందేశం ఉంటుంది ఈ చిత్రంలో అని తెలిపారు దర్శకుడు. ఇతర పాత్రలలో పోసాని కృష్ణమురళి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు. కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: సాయికార్తీక్, పాటలు: శ్యాం కాసర్ల, ఎడిటింగ్: నాగిరెడ్డి, సమర్పణ: జ్యోత్స్నారెడ్డి, నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు.


Click it and Unblock the Notifications












