అన్న పై పగతో రగులుతున్న శ్రీకాంత్
శ్రీకాంత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఎల్.వి.ఆర్.ప్రొడక్షన్స్ పతాకంపై లగడపాటి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయదశమి రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా సముద్ర మాట్లాడుతూ 'ఇద్దరు అన్నదమ్ముల మధ్య పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సినిమా ఇది.
సనాతన హిందూ ధర్మాలను మనం ఎలా కాపాడుకోగలమో..చెబుతూ సందేశం ఇస్తున్నాం. భారీ కమర్షియల్ సినిమా ఇది"" అన్నారు. శ్రీకాంత్‌తో పాటు ప్రముఖ హీరో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తారు అన్నారు సమర్పకులు ముత్తినేని సత్యనారాయణ. 3 షెడ్యూళ్లలో సినిమా పూర్తిచేస్తామని నిర్మాత తెలిపారు. నాజర్, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి బేనర్: శ్రీ తారకరామ ఫిల్‌మ్స-ఎల్.వి.ఆర్.ప్రొడక్షన్స్, కథనం- దర్శకత్వం: వి.సముద్ర.


Click it and Unblock the Notifications











