Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
శ్రీకాంత్ చిత్రంలో 'లంజ కొడకా' పదం చాలాసార్లు సెన్సార్ కట్
దొంగగా, ఫ్యాక్షనిస్టుగా శ్రీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం "రంగ ది దొంగ". విమలా రామన్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం 30-12-2010న విడుదల అయింది. గోల్డెన్ లయన్ ఫిలిమ్స్ గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ పతాకాన సి.ఆర్. మనోహర్, సుధాకర్ నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు సుధాకర్ నాయుడు (జి.వి). ఇ.సి. ఈ చిత్రాన్ని చూసి 10 కట్స్ తో 21-12-2010న పెద్దలకు మాత్రమే అంటూ 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఆ సెన్సార్ కట్స్ వివరాలు...
1. మద్యపానం, ధూమపానంకి సంబంధించిన దృశ్యాలు చిత్రంలో ఎక్కడ వచ్చినా అందుకు సంబంధించిన హెచ్చరిక కూడా చూపాలని సూచించారు.
2. చిత్రంలో క్లీవేజ్ ఎక్స్పోజర్, బెల్లి బటన్ ఎక్సపోజర్ దృశ్యాలు ఎక్కడున్నా అవి ఫ్లాష్‌లా వుండేలా తగ్గించాలని లేదా తొలగించాలని సూచించారు.
3. ఒకటి రెండు రీళ్లలోని మొదటి పాటలోని 2వ చరణాన్ని, పిల్లయితే పేచి పెట్టి, బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీలను తొలగించారు.
4. ఒకటి రెండు రీళ్ళలో డ్యాన్సర్ తుంటి భాగాన్ని హీరో పట్టుకుని తిప్పే సన్నివేశానికి సంబంధించిన క్లోజప్ దృశ్యాలను తొలగించారు.
5. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో గల 'ఇది సీటా కంచు ప్లేటా' అనే డైలాగ్ కత్తిరించారు.
6. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన 'అందమైన ఆడ పోలీస్ అయితే పద్దాక గాడిలో వుంటారు' అనే మాటలు తొలగించారు.
7. మూడు నాలుగు రీళ్ళలోని 'ఈ అమ్మాయి ఓపెనింగా నా ఓపెనింగ్ కాదూ' అనే డైలాగ్‌ని తొలగించారు.
8. అయిదు ఆరు రీళ్ళలో ఫ్యాక్షనిస్ట్ ని శకుంతల మర్డర్ చేసే సన్నివేశంలో 50 శాతం నిడివి తగ్గించారు.
9. ఏడు ఎనిమిది రీళ్లలో కోర్టు బయట జరిపిన బాంబ్ బ్లాస్ట్ సన్నివేశం నిడివిని 50 శాతం తగ్గించారు.
10. తొమ్మిది పదిరీళ్ళలో వున్న 'లంజ కొడకా' పదాన్ని తొలగించారు.