నవ్వులతో ట్విస్ట్ (‘ఆల్ ది బెస్ట్’ప్రివ్యూ)
జేడీ చక్రవర్తి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన 'ఆల్ ది బెస్ట్' ఈరోజు (శుక్రవారం)ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడుగా జెడీ చక్రవర్తి ఈ కామెడీ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ కథనాన్నే నమ్ముకుని సినిమాలు తీశాను. తొలిసారి కథను నమ్మి రూపొందించిన చిత్రమిది. శ్రీకాంత్ నటన అందరికీ నచ్చుతుంది. హాస్యరస ప్రధానంగా సాగుతుందీ చిత్రం అన్నారు.
చిత్రంలో శ్రీకాంత్ ..రవి అనే పాత్రలోకనిపిస్తాడు. రవి (శ్రీకాంత్) నీతి నిజాయతితో బతికే యువకుడు. అతని తండ్రి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాడు. అప్పటికప్పుడు డబ్బు అత్యవసరమైన స్థితిలో చందు (జె.డి.చక్రవర్తి)తో పరిచయం ఏర్పడుతుంది రవికి. మాయమాటలు చెప్పి బతికే వ్యక్తి చందు. ఈ ఇద్దరు కలిసి డబ్బు సంపాదించే ఆలోచనని అమలుపరిచే క్రమంలో లక్కీ (లక్కీ శర్మ), ఉపాసన (అనీషా) తదితరులను కలుపుకొంటారు. వీరంతా కలిసి చివరికి ఏం చేశారనేది అసలు కథ.
నిర్మాత గురించి జెడీ మాట్లాడుతూ..''ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం. విడుదల చేయడం ఇంకా కష్టం. మా నిర్మాత సాంబశివరావు భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. శ్రీకాంత్ చేయకపోతే నేనీ సినిమా చేసేవాణ్ణి కాదు. 'మనీ మనీ మోర్ మనీ'తో ప్రేక్షకులను బాగా వినోదపరచాలనుకున్నా. కుదర్లేదు. ఆ లోటు ఈ చిత్రంతో తీరుతుంది'' అని చెప్పారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ -''జేడీ, నేను కలిసి నటించిన మూడో సినిమా ఇది. ఇందులో ఇద్దరం స్నేహితులమే కానీ, ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటుంటాం. ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి శైలిలో ఈ సినిమా ప్రేక్షకుల్ని వినోదపరుస్తుంది'' అని తెలిపారు.
సంస్థ: సుధా సినిమా
నటీనటులు: శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, లక్కీ శర్మ, అనీషా సింగ్, బ్రహ్మానందం, రావు రమేష్, రఘుబాబు, దువ్వాసి మోహన్ తదితరులు.
నిర్మాత: జె.సాంబశివరావు
దర్శకత్వం: జేడీ చక్రవర్తి
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











